Abn logo
Jun 11 2021 @ 14:00PM

మహిళ అనుమానాస్పద మృతి

అనంతపురం: పుట్టపర్తి సమీపంలోని పెద్ద కమ్మవారిపల్లిలో కుమారమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గత మూడు రోజులుగా కుమారమ్మని ఆస్తి కోసం సొంత అన్న కుమారుడే వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుమారమ్మ మృతదేహం గ్రామ సమీపంలోని బావిలో కనిపించింది. కుమారమ్మ అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement