గోల్నాకలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి

ABN , First Publish Date - 2020-05-28T20:15:27+05:30 IST

హైదరాబాద్: అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్నాకలోని సెంట్ అంబర్ స్కూల్‌లో గుర్తుతెలియని మహిళ(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

గోల్నాకలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి

హైదరాబాద్: అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి గోల్నాకలోని సెంట్ అంబర్ స్కూల్‌లో గుర్తుతెలియని మహిళ(50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్కూల్ గేట్లకు బయట నుంచి తాళాలు వేసి ఉన్నా కూడా స్కూల్ లోపల మృతదేహం ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం కుళ్ళిపోయి వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


Updated Date - 2020-05-28T20:15:27+05:30 IST