ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన భార్య.. కోలుకుందనుకున్న ఆమె చనిపోవడంతో డాక్టర్లకే షాక్.. అనుమానంతో టెస్టులు చేస్తే..

ABN , First Publish Date - 2021-08-09T23:07:59+05:30 IST

సడెన్‌గా ఛాతీ నొప్పి రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆమె.. కోలుకునేలాగే కనిపించింది.

ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన భార్య.. కోలుకుందనుకున్న ఆమె చనిపోవడంతో డాక్టర్లకే షాక్.. అనుమానంతో టెస్టులు చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: సడెన్‌గా ఛాతీ నొప్పి రావడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న ఆమె.. కోలుకునేలాగే కనిపించింది. దీంతో వైద్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అంతా సాఫీగా జరుగుతోందని అనుకుంటుండగా సడెన్‌గా ఆమె కన్నుమూసింది. దీంతో డాక్టర్లే షాకైపోయారు. పొరబాటు ఎక్కడ జరిగిందో వారికి అర్థం కాలేదు. చికిత్స సమయంలో ప్రమాదవశాత్తూ ఆమె మరణించిందని అందరూ అనుకున్నారు. కానీ పోస్టుమార్టంలో మాత్రం నమ్మలేని నిజం బయటపడింది. అదేంటంటే.. ఆమెకు ఎవరో సైనేడ్ విషమిచ్చారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అప్పుడు మరో షాకింగ్ నిజం వెలుగు చూసింది.


గుజరాత్‌లోని అంకలేశ్వర్‌కు చెందిన ఊర్మిళా వాసవ(34) అనే మహిళకు ఛాతీ నొప్పి వచ్చింది. దీంతో ఆమెను భర్త జిగ్నేశ్ పటేల్ స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమె సడెన్‌గా చనిపోయింది. ఇది ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా అందరూ భావించారు. అయితే పోస్టుమార్టంలో ఊర్మిళ శరీరంలో సైనేడ్ దొరకడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దర్యాప్తు చేయగా, తాను పనిచేసే ఫ్యాక్టరీ నుంచి జిగ్నేశ్ ఈ విషం తీసుకొచ్చినట్లు తేలింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ నిజం బయటపడింది. ఆస్పత్రిలో భార్య చికిత్స పొందుతుండగా.. తన వద్ద ఉన్న సైనేడ్‌ను నీళ్లలో కలిపిన జిగ్నేశ్, దాన్ని ఆమె సెలైన్ బాటిల్‌లో కలిపేశాడు. దీంతో ఆమె కన్నుమూసింది. జిగ్నేశ్‌పై ఐపీసీ సెక్షన్ 302 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-08-09T23:07:59+05:30 IST