Advertisement
Advertisement
Abn logo
Advertisement

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

గుత్తి రూరల్‌, డిసెంబరు 5: మండలంలోని ఊటకల్లు గ్రామానికి చెందిన లీలావతి (32) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెం దింది. స్థానికులు తెలిపిన వివరాలి వి. గ్రామానికి చెందిన జనార్ధనయ్య, లీలావతికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఈక్రమంలో ఉదయం లీలావతి ఇంట్లో ఫ్యా నకు ఉరేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు స మాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని సీఐ శ్యామరావు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా లీలావతి మృతికి భర్త కారణమని అనుమానం వ్యక్తం చేస్తూ మృ తురాలి తల్లిదండ్రులు సీఐకు ఫిర్యాదు చేశారు. ఈమేర కు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Advertisement
Advertisement