పది మంది పిల్లలను కన్న తల్లి.. పదో బిడ్డకు జన్మనిచ్చిన పది రోజుల్లోనే..

ABN , First Publish Date - 2021-01-24T11:34:10+05:30 IST

‘‘పెళ్లి చేసుకొని పది మంది పిల్లలతో చల్లగా ఉండు’’ అంటూ పెద్దవాళ్లు దీవించడం చాలా సార్లు విన్నాం కదా. ఈ దీవెనను నిజం చేసిందో మహిళ. నిజంగానే పదిమంది పిల్లకు జన్మనిచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ పదో బిడ్డ కడుపులో ...

పది మంది పిల్లలను కన్న తల్లి.. పదో బిడ్డకు జన్మనిచ్చిన పది రోజుల్లోనే..

సౌత్ కరోలినా: ‘‘పెళ్లి చేసుకొని పది మంది పిల్లలతో చల్లగా ఉండు’’ అంటూ పెద్దవాళ్లు దీవించడం చాలా సార్లు విన్నాం కదా. ఈ దీవెనను నిజం చేసిందో మహిళ. నిజంగానే పదిమంది పిల్లకు జన్మనిచ్చింది. అయితే దురదృష్టవశాత్తూ పదో బిడ్డ కడుపులో ఉండగా ఆమెకు కరోనా వైరస్ సోకింది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పేరు ఆష్లే బెన్నెట్. 36 ఏళ్ల వయసులో పదోసారి గర్భందాల్చిన ఆమెకు కరోనా సోకింది. ఆస్పత్రిలో ఉండగా చాలా వేగంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది.


దీంతో ఆందోళన చెందిన వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేసి ఆమెకు డెలివరీ చేశారు. ఇది జరిగిన పదిరోజుల్లోపే ఆష్లే కరోనాకు బలైంది. ఆష్లే మరణ వార్త గురించి చెప్పుకుంటున్న ఆమె భర్త డారిల్.. ‘కరోనాను అందరూ సీరియస్‌గా తీసుకోవాలి. మా ఆవిడ వయసు కేవలం 36. కానీ ఆమె ప్రాణాలు కోల్పోయింది’ అంటూ కన్నీరు పెట్టుకుంటున్నాడు. ఆమె పిల్లల సంగతి అయితే వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు ఇంకా ఈ షాక్ నుంచి కోలుకోలేదు. ఈ పిల్లల్లో అందరికంటే చిన్నవాడి వయసు కేవలం ఏడాదే. ఆ పసివాడు తల్లికోసం రోజూ ఏడవడం వింటుంటే కన్నీళ్లు ఎవరికీ ఆగవు కదా అంటున్నారు కుటుంబ సభ్యులు.

Updated Date - 2021-01-24T11:34:10+05:30 IST