Advertisement
Advertisement
Abn logo
Advertisement

సోదరుడి పెళ్లి పూర్తవగానే.. నేరుగా రైల్వే స్టేషన్‌కు వెళ్లిన సోదరి.. అర్ధరాత్రి వేళ ప్లాట్‌ఫాంపై కూర్చుని ఆమె చేసిన పనికి బంధువులు షాక్..

ఇంటర్నెట్ డెస్క్: సోదరుడి పెళ్లి వేడుకలో ఆ సోదరి సందడి చేసింది. దగ్గరుండి మరీ సోదరుడి వివాహాన్ని అంగరంగ వైభంగా జరిపించింది. ఆ తర్వాత పెళ్లి ఇలా పూర్తవగానే.. అర్ధరాత్రి వేళ స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్‌కు హడావిడిగా బయల్దేరింది. అనంతరం ప్లాట్‌ఫాంపై కూర్చుని ఆమె చేసిన పనిని చూసి పెళ్లికొచ్చిన బంధువులు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రైల్వే స్టేషన్‌లో ఇంతకూ ఆమె ఏం చేసింది అనే వివరాల్లోకి వెళితే..


బెంగాల్‌కు చెందిన పాపియా కర్ అనే మహిళకు ఓ సోదరుడు ఉన్నాడు. తాజాగా అతడి పెళ్లి జరగ్గా.. ఆ వేడుకలో పాపియా సందడి చేసింది. అన్నీ తానై వ్యవహరించి.. అంగరంగా వైభంగా పెళ్లి జరిగేలా చూసింది. పెళ్లి ముగిసి.. అందరూ భోజనాలు చేసిన తర్వాత, అర్ధారాత్రి 12 గంటలకు ఆమె హడావిడిగా స్థానికంగా ఉన్న రణఘాట్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అనంతరం స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంపై కూర్చుని.. పెళ్లి వేడుకలో మిగిలిపోయిన భోజనాన్ని అక్కడ ఉన్న పేద ప్రజలకు పంచి పెట్టింది. కాగా.. మిగిలి పోయిన ఆహారపదార్థాలను పాపియా రైల్వే స్టేషన్‌కు తరలించడం చూసి.. తొలుత ఆమె బంధువులు ఆయోమయానికి లోనయ్యారు. 


కానీ స్టేషన్‌లో ఆమె చేసిన మంచి పనిని చూసి.. ఆశ్చర్యపోవడంతోపాటు ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఆమె ఆహారపదార్థాలను అందిస్తున్న దృశ్యాలను ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫొటోలు కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆహారం వృథా కాకుండా ఆమె చేసిన పనిపట్ల హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ క్రమంలోనే స్పందించిన ఓ వ్యక్తి.. ఆమె చాలా రోజులుగా పేదలకు ఆహారపదార్థాలను అందిస్తూ వారి కడుపు నింపుతున్నట్టు కామెంట్ ద్వారా వెల్లడించారు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement