Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త మాజీ భార్య కోసం కిడ్నీ ఇచ్చేసింది

ఫ్లోరిడాకు చెందిన డెబ్బీ అనే మహిళ చేసిన త్యాగం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ముఖ పరిచయం మాత్రమే ఉన్న వ్యక్తి కోసం, అందునా తన భర్త మాజీ భార్య కోసం ఆమె ఏకంగా తన కిడ్నీనే ఇచ్చేసింది. అదీ పెళ్లైన రెండ్రోజులకే ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమె కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే 20 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ పిల్లల కోసం ఇప్పటికీ స్నేహితులుగా కొనసాగుతున్నారు. భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్‌.. డెబ్బీ నీల్‌తో డేటింగ్‌ ప్రారంభించాడు. గత ఏడాది నవంబర్ 22న వీరు వివాహం చేసుకున్నారు. కాగా, కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జిమ్‌ మాజీ భార్య మైలాన్(59) గతేడాది నవంబర్‌లో తీవ్ర అస్వస్థకు గురైంది. ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ఆమె కిడ్నీతో బంధువులెవరిదీ మ్యాచ్‌ కాలేదు. మైలాన్‌ పరిస్థితి తెలుసుకున్న డెబ్బీ తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది.


అప్పటికి కేవలం రెండు రోజుల ముందే జిమ్‌, డెబ్బీల వివాహం జరిగింది. మైలాన్‌తో డెబ్బీకి ముఖ పరిచయం మాత్రమే ఉంది. అయినా ఆమె తన కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. వైద్యుల రకరకాల పరీక్షలు చేసి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. జిమ్‌, డెబ్బీల వివాహం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ సర్జరీ చేశారు. అపరేషన్ విజయవంతంగా ముగియడంతో ఇద్దరూ ఇళ్లకు చేరుకున్నారు. ఇకపై తామిద్దరం కిడ్నీ సిస్టర్స్‌గా కొనసాగుతామని చెప్పారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement