Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 11 2021 @ 20:17PM

కదులుతున్న కారులో అత్యాచారం..నిందితుల అరెస్టు

చెన్నై: ముంబైలో 34 ఏళ్ల మహిళ అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ శనివారం మరణించిన సంఘటన తరహాలోనే తమిళనాడులోనూ ఓ అత్యాచార ఘటన వెలుగుచూసింది. చెన్నై సమీపంలోని కాంచీపురంలో కదులుతున్న కారులోనే 20 ఏళ్ల యువతిపై ఐదుగురు అత్యాచారం జరిపారు. రెండ్రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది.

సంఘటన వివరాల ప్రకారం, అత్యాచార బాధితురాలు ఓ మొబైల్ ఫోన్స్ దుకాణంలో పనిచేస్తోంది. సామూహిక అత్యాచారం తరువాత రోడ్డు పక్కనే ఆమెను పడేశారు. అయితే, స్థానిక పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతూ కోలుకుంటోంది.

అత్యాచార నిందితులలో ఒకరైన గుణశీలన్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు, తొలుత గుణశీలన్ ఆ యువతికి మత్తుపానీయం ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోగానే గుణశీలన్‌తో అతని ఫ్రండ్స్ వచ్చి కలిశారు. కాంచీపురం సిటీ సమీపంలో కదులుతున్న కారులోనే ఆమెపై లైంగిక దాడి చేశారు. బాధితురాలు స్పృహలోకి రాగానే కాపాడమంటూ కేకలు వేసింది. ఆ కేకలు విని సమపంలోని పోలీసులు అక్కడకు చేరుకోగానే నిందితులు ఆమెను రోడ్డుపైకి నెట్టేసి పారిపోయారు. పోలీసుల తాజా సమాచారం ప్రకారం, నిందితులలో నలుగురిని ఈనెల 9న అరెస్టు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శుక్రవారంనాడు మరో వ్యక్తిని అరెస్టు చేశారు.

Advertisement
Advertisement