Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ భార్యాభర్తలు ఎంత సంతోషంగా ఉన్నారో అనిపిస్తోందా..? రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట పరిస్థితి ఇప్పుడేంటో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: వారిద్దరూ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.. ఇద్దరు ధనిక కుటుంబాలకు చెందిన వ్యక్తులు కావడంతో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.. వివాహం తర్వాత సంవత్సరం పాటు బాగానే ఉన్నారు.. ఓ బిడ్డకు తల్లిదండ్రులు కూడా అయ్యారు.. ఆ తర్వాతే కలతలు ప్రారంభమయ్యాయి.. భర్తకు వేరే మహిళలతో సంబంధాలు ఉన్నట్టు గ్రహించిన యువతి అతడిని నిలదీసింది.. దీంతో అతడు పశువులా మారాడు.. భార్యను హింసించడం ప్రారంభించాడు.. దీంతో ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. 


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన సూర్యవంశ్ 2019లో ఆంచల్ కర్బందాను వివాహం చేసుకున్నాడు. 2020లో వీరికి ఓ మగ బిడ్డ జన్మించాడు. కాగా, భర్త కోసం కొందరు యువతులు ఇంటి వస్తుండడం, వారితో అతను చనువుగా ప్రవర్తిస్తుండడాన్ని ఆంచల్ తట్టుకోలేకపోయింది. భర్తను నిలదీసింది. దీంతో సూర్యవంశ్, అతడి తల్లిదండ్రులు ఆంచల్‌ను వేధించడం ప్రారంభించారు. ఆమెను శారీరకంగా హింసిస్తూ ఇంట్లోనే బంధీని చేశారు. గురువారం రాత్రి ఆ విషయాలను ఆంచల్ తన తల్లిదండ్రులకు చెప్పింది. 


ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పింది. దీంతో వెంటనే వారు ఆంచల్ ఇంటికి బయల్దేరారు. అయితే వారు వచ్చే సరికే ఆంచల్ ఉరేసుకుని చనిపోయింది. ఆమె కుమారుడు పక్కనే ఉన్నాడు. సూర్యవంశ్, అతడి తల్లిదండ్రులు ఇంటి నుంచి పరారయ్యారు. ఆంచల్ తల్లిదండ్రులు ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూర్యవంశ్, అతడి కుటుంబ సభ్యుల గురించి అన్వేషణ సాగిస్తున్నారు.Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement