Abn logo
Oct 23 2021 @ 12:20PM

అడల్ట్ సైట్‌లో తండ్రి అకౌంట్.. వెంటనే ఆమె చేసిన పనికి బిత్తరపోయిన తండ్రి..

అడల్ట్ కంటెంట్ ఇండస్ట్రీ వివిధ వయసుల వారిని ఆక్టటుకునే ప్రయత్నం చేస్తుంటుంది. యువత మొదలుకొని వృద్ధుల వరకూ ఇటువంటి సైట్లు చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ సైట్‌లలో మోడల్స్ తమ జీవితానుభవాలను వివరిస్తుంటారు. తాజాగా ఒక మోడల్ ఈ అడల్ట్ సైట్‌లో తన అనుభవాలను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఇది చర్చనీయాంశంగా మారింది. ఒకసారి తాను ఒక సైట్‌లో తన తండ్రి అకౌంట్‌ను చూశానన్నారు. ఆ తరువాత జరిగిన ఘటన అందిరినీ ఆశ్చర్యపరుస్తుందన్నారు. ఎవా లూయిస్ ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. అలాగే అడల్ట్ మోడల్. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో మూడు లక్షలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. 

తాజాగా  ఆమె ఒక టిక్ టాక్ వీడియోను షేర్ చేశారు. దానిలో ఆమె అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఒకసారి తాను షుగర్ డాడీ అనే వెబ్ సైట్ చూశానని, దానిలో తన తండ్రి అకౌంట్ ఉన్నదని తెలిపారు. ఈ సైట్ వయసు మీదపడిన వారికి సంబంధించినదని తెలిపారు. ఈ సైట్ ద్వారా అశ్లీల కార్యకలాపాలు జరుగుతుంటాయన్నారు. ఆ సైట్‌లో తన తండ్రి మరో యువతితో తిరుగుతున్న దృశ్యం ఉన్నదన్నారు.  తాను వెంటనే మెసేజ్ బాక్స్‌లో హాయ్.. డాడ్ అని రాశానన్నారు. ఈ మెసేజ్ చూడగానే తన తండ్రి తన అకౌంట్ బ్లాక్ చేశారని తెలిపారు. అయితే ఆ తరువాత ఈ విషయమై తండ్రితో ఎప్పుడూ చర్చించలేదన్నారు. ఈ విడియోను చూసిన పలువురు యూజర్లు ఆమెకు పలు సలహాలిస్తున్నారు. ఈ విషయాన్ని తల్లికి చెప్పివుండాల్సిందని కొందరు సూచించడంతో ఎవా అదేపని చేశారు. అయితే ఆమె తండ్రి అత్యంత ఖరీదైన వాచీ కానుకగా ఇవ్వడంతో తల్లి ఆగ్రహం చల్లారిందని ఎవా తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...