Abn logo
Sep 24 2021 @ 12:14PM

Viral Video: ఓ మహిళకు షాకింగ్ అనుభవం.. రెండు కాళ్ల మధ్యలో ప్యాంటుకు వేలాడుతున్న దాన్ని చూసి..

ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఓ మహిళ తన రెండు కాళ్ల మధ్యన ప్యాంటుకు వేలాడుతున్న దానిని చూసి షాకైంది.. దాని నుంచి చిన్న చిన్న శబ్దాలు రావడం చూసి భయపడిపోయింది.. అది గబ్బిలం అని తెలుసుకున్న తర్వాత ఆమె భయం మరింత ఎక్కువైంది.. ఆమె ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 



`నేను నా కాళ్ల మధ్యన ఉన్న గబ్బిలాన్ని గమనించలేదు. శబ్దం వస్తుంటే ఏమిటా అని చూశా. గబ్బిలం అని గుర్తించి భయపడిపోయా. నా భర్త వచ్చి దానిని తొలగించారు. అయితే కొద్దిసేపటికే అది చనిపోయింది. ప్రకృతిని నాశనం చేస్తే ఇలాంటి పరిణామాలే సంభవిస్తాయ`ని ఆ మహిళ పేర్కొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 40 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. తమదైన శైలిలో కామెంట్లు చేశారు. 

ప్రత్యేకంమరిన్ని...