తుపాకీ చూపించి బెదిరించి మహిళపై సామూహిక లైంగిక దాడి

ABN , First Publish Date - 2020-07-28T18:05:10+05:30 IST

ఓ మహిళకు తుపాకీ చూపించి బెదిరించిన యువకులు ఆమెపై సామూహిక లైంగికదాడి చేసిన దారుణ ఘటన....

తుపాకీ చూపించి బెదిరించి మహిళపై సామూహిక లైంగిక దాడి

ధోల్పూర్ (రాజస్థాన్) :  ఓ మహిళకు తుపాకీ చూపించి బెదిరించిన యువకులు ఆమెపై సామూహిక లైంగికదాడి చేసిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దోల్పూరు పట్టణంలోని సైపావు ప్రాంతంలో వెలుగుచూసింది. థానా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల ఓ మహిళను కొందరు యువకులు నిర్జనప్రదేశానికి ఎత్తుకెళ్లి తుపాకీ చూపించి బెదిరించి ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి అనూప్ చౌదరి చెప్పారు. గత ఆదివారం 24 ఏళ్ల మహిళపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో  వరుస ఘటనలపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-07-28T18:05:10+05:30 IST