Abn logo
Oct 9 2021 @ 12:28PM

Shocking: కదులుతున్న రైలులో మహిళపై 8మంది అత్యాచారం

న్యూఢిల్లీ : కదులుతున్న రైలులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన శనివారం వెలుగుచూసింది.లక్నో-ముంబై వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఇగత్‌పురి స్టేషన్ నుంచి బయలుదేరినప్పుడు ఈ దారుణ సంఘటన జరిగింది. ముంబై వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళపై 8 మంది కీచకులు అత్యాచారానికి పాల్పడ్డారు.పుష్పక్ రైలు కంపార్టుమెంటులోకి 8మంది బలవంతంగా ప్రవేశించి కత్తులు చూపించి 20మంది ప్రయాణికులను దోచుకున్నారు.ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.

రైలులో ఉన్న 30 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిపై 8మంది దుండగులు సామూహిక అత్యాచారం జరిపారు. బాధిత మహిళకు గాయాలయ్యాయి.అరగంట పాటు నిందితులు మహిళపై అఘాయిత్యం చేశారు. రైలు కాసర స్టేషనుకు చేరుకోవడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు శనివారం తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...