Advertisement
Advertisement
Abn logo
Advertisement

నాకు తెలియకుండా మరో పెళ్లి చేసుకుంది.. నా భార్యను నా వద్దకు రప్పించండి.. ఓ భర్తకు వింత పరిస్థితి..!

ఇంటర్నెట్ డెస్క్: కొన్ని రోజులపాటు తన వద్దే ఉండి, పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పిన భార్య.. మరో పెళ్లి చేసుకుందని తెలిసి అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. విడాకులు తీసుకోకుండానే మీ కూతురికి మరో వ్యక్తితో వివాహం ఎలా చేస్తారు అని అత్తామామలను అడగ్గా.. వారి నుంచి ఊహించని సమాధానం వచ్చింది. దీంతో చేసేదేమీ లేక అతడు పోలీసులను ఆశ్రయించాడు. నా భార్యను నా వద్దకు రప్పించండి అంటూ వేడుకున్నాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని భింద్ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి రేఖ అనే మహిళతో 2017 మార్చిలో వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల పెళ్లైన తర్వాత ధర్మేంద్ర తన భార్యను తనతోపాటు ఢిల్లీకి తీసుకెళ్లలేదు. దీంతో ఆమె కొన్ని రోజులపాటు తన అత్తామామలతో ఉండాల్సి వచ్చింది. అనంతరం ఢిల్లీలో అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ధర్మేంద్ర.. తన భార్యను తనతోపాటు ఢిల్లీకి తీసుకెళ్లాడు. భర్తతో కలిసి ఢిల్లీ వెళ్లిన రేఖ.. అక్కడ ఎక్కువ రోజులు అతడితో ఉండలేదు. పుట్టింటికి వెళ్లొస్తానని చెప్పి, తన తల్లిదండ్రులకు వచ్చేసింది. ఆ తర్వాత అక్కడే మకాం వేసిన ఆమె.. ఖర్చుల కోసం నెల నెలా డబ్బులు పంపాల్సిందిగా ధర్మేంద్రను కోరింది. దీనికి అతడు అంగీకరించి.. నెల నెలా రేఖకు డబ్బులు పంపాడు. అయితే తాజాగా తన భార్య రేఖ గురించి.. ధర్మేంద్రకు సంచలన విషయం తెలిసింది. ఆమె ఎవరినో వివాహం చేసుకుందని తెలిసి.. ఢిల్లీ నుంచి హుటాహుటిన రేఖ పుట్టింటికి చేరుకున్నాడు. తన భార్యను వెరొకరికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారంటూ ఆమె తల్లిదండ్రులను నిలదీశాడు. 


ఈ క్రమంలో వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి అతడు కంగుతిన్నాడు. రెండు లక్షలు డిమాండ్ చేయడంతో విస్తుపోయాడు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా వివరించి.. తన భార్యను తన వద్దకు రప్పించండి అంటూ పోలీసులను వేడుకున్నాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. రేఖను ఆమె తల్లిదండ్రులను ఆమె రెండో భర్త రాయ్‌సింగ్‌ను అధికారులు స్టేషన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేఖ.. తనకు ధర్మేంద్ర నచ్చలేదని.. అందుకే రెండో పెళ్లి చేసుకున్నాని పోలీసులకు వెళ్లడించింది. అయితే మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోకుండా.. రెండో వివాహం చెల్లదని పోలీసులు ఆమెకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. పోలీస్ స్టేషన్‌లో జరిగిన సంఘటనను చూసిన తర్వాత రేఖ రెండో భర్త రాయ్‌సింగ్.. విస్తుపోయాడు. రేఖకు ఇంతకు ముందే పెళ్లైన విషయం తనకు తెలియదని.. తెలిసుంటే ఈ పెళ్లి చేసుకునే వాడిని కాదని పేర్కొన్నాడు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement