ఒకే కాన్పులో 9మంది

ABN , First Publish Date - 2021-05-06T07:23:48+05:30 IST

ఓ గర్భిణికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆమెకు ఒకే కాన్పులో ఏడుగురు శిశువులు జన్మిస్తారని చెప్పారు. అయితే ఆ వైద్యుల అంచనా తప్పింది! మరో ఇద్దరు కలిపి.. ఆమెకు మొత్తంగా తొమ్మిది మంది...

ఒకే కాన్పులో 9మంది

  • మాలీలో ఘటన.. ఆరోగ్యంగా తల్లీబిడ్డలు

న్యూఢిల్లీ, మే 5: ఓ గర్భిణికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆమెకు ఒకే కాన్పులో ఏడుగురు శిశువులు జన్మిస్తారని చెప్పారు. అయితే ఆ వైద్యుల అంచనా తప్పింది! మరో ఇద్దరు కలిపి.. ఆమెకు మొత్తంగా తొమ్మిది మంది శిశువులు పుట్టారు. ఆ మాతృమూర్తి.. ఆఫ్రికా దేశమైన మాలీకి చెందిన 25 ఏళ్ల హలిమా సిస్సే! ఆమె గర్భంతో ఉన్నప్పుడే మెరుగైన వైద్య చికిత్స కోసం మాలీ ప్రభుత్వం మార్చి 30న ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోకు తరలించింది. అక్కడి ఓ ఆస్పత్రిలో హలిమా.. 9మంది బిడ్డలకు జన్మనిచ్చింది. వీరిలో ఐదుగురు ఆడ శిశువులు, నలుగురు మగ శిశువులు ఉన్నారు. తల్లీబిడ్డలంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రిలోనే మరికొన్నాళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచి స్వస్థలానికి పంపుతామని వైద్యులు పేర్కొన్నారు.  


Updated Date - 2021-05-06T07:23:48+05:30 IST