పొద్దున్నే ఆరు గంటల సమయంలో ఓ మహిళ అరుపులు విని పరుగెత్తుకుంటూ వెళ్లిన స్థానికులు.. అక్కడ కనిపించిన సీన్ చూసి..

ABN , First Publish Date - 2021-10-21T19:47:59+05:30 IST

ఆ మహిళ ప్రతిరోజూలాగే ఆ రోజు కూడా పొలం పనులకు వెళ్లింది. ఉదయం ఆరుగంటల సమయంలో ఆ మహిళ దగ్గరి నుంచి అరుపులు వినిపించాయి. పరుగెత్తుకుంటూ వెళ్లిన స్థానికులు అక్కడ కనిపించిన సీన్ చూసి షాకయ్యారు.

పొద్దున్నే ఆరు గంటల సమయంలో ఓ మహిళ అరుపులు విని పరుగెత్తుకుంటూ వెళ్లిన స్థానికులు.. అక్కడ కనిపించిన సీన్ చూసి..

జైపూర్: ఆ మహిళ ప్రతిరోజూలాగే ఆ రోజు కూడా పొలం పనులకు వెళ్లింది. ఉదయం ఆరుగంటల సమయంలో ఆ మహిళ దగ్గరి నుంచి అరుపులు వినిపించాయి. పరుగెత్తుకుంటూ వెళ్లిన స్థానికులు అక్కడ కనిపించిన సీన్ చూసి షాకయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఆ మహిళ అరుపులకు కారణం ఏంటి..? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


రాజస్థాన్‌లోని మౌంట్ అబూ టోర్నా ప్రాంతానికి చెందిన దేవి సింగ్ భార్య హిరా దేవి. ఎప్పటిలాగే ఆమె గురువారం పొద్దున పొలం పనులకు వెళ్లింది. ఘోర చోప్ర రోడ్ ప్రాంతంలో హిరా దేవి పని చేస్తుండగా సడెన్‌గా ఓ పెద్ద ఎలుగుబంటి అక్కడకు వచ్చి ఆమెపై దాడి చేసింది. అపుడు ఆ మహిళ బిగ్గరగా కేకలు వేస్తూ అరవడం ప్రారంభించింది. దగ్గర్లో ఉన్న స్థానికులు మహిళ అరుపులు విని అక్కడకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరడంతో వారి అలికిడి విని ఎలుగుబంటి అడవిలోకి పరుగెత్తుకెళ్లింది. కాగా ఎలుగుబంటి దాడిలో హిరాదేవి తల, చేతులు, ముఖంపై తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచాం అందించి, హిరాదేవిని ఆసుపత్రిలో చేర్పించారు. 


అయితే ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు  అక్కడకు చేరుకుని ఎలుగుబంటిని వెతకడం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. గత కొద్ది రోజులుగా ప్రజలపై ఎలుగుబంట్లు దాడి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. జ్ఞాన్ సరోవర్ రోడ్డులోని ఒక వృద్దుడిపై, గోర చప్రాలోని 12ఏళ్ల బాలికపై కూడా ఎలుగుబంటి దాడి చేసిందని తెలిపారు. మౌంట్ అబు సిటీలోని గురు శికార్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఓ చిరుతపులి సంచారించినట్లు సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ప్రభాత్ సింగ్ మెర్టియా అనే వ్యక్తికి రాత్రి చిరుతపులి కనిపించిందని, అతడు దాని కంటపడకుండా పొదల చాటున దాక్కొని ఫొటో తీశాడని తెలిపారు. 

Updated Date - 2021-10-21T19:47:59+05:30 IST