కిలాడీ లేడి వీడియో కాల్ చేసి..నయా మోసం

ABN , First Publish Date - 2021-02-19T18:15:34+05:30 IST

ఓ కిలాడీ లేడి నయా మోసానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది....

కిలాడీ లేడి వీడియో కాల్ చేసి..నయా మోసం

నగ్నంగా వీడియో రికార్డు చేసి, బ్లాక్ మెయిలింగ్

బెంగళూరు (కర్ణాటక): ఓ కిలాడీ లేడి నయా మోసానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో వెలుగుచూసింది. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీరునంటూ ఓ అమ్మాయి వీడియోకాల్ చేసి నగ్నంగా వీడియో తీసి దాన్ని బహిర్గతం చేస్తానని బెదిరించి యువకుడి నుంచి డబ్బు గుంజిన ఘటన సంచలనం రేపింది. బెంగళూరు నగరానికి చెందిన అంబీట్ కుమార్ మిశ్రా అనే యువకుడు మ్యాట్రిమోనియల్ సైట్‌లో తన పేరును రిజిస్టరు చేసుకున్నారు. దాన్ని చూసిన ఓ యువతి తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీరునంటూ, పెళ్లి ప్రతిపాదన చేసింది. అంబీట్ కుమార్ మిశ్రాతో యువతి వీడియోకాల్‌లో మాట్లాడుతూ తన దుస్తులను తొలగించి యువకుడిని కూడా దుస్తులు తొలగించాలని కోరింది. 


దీంతో అంబీట్ కుమార్ మిశ్రా కూడా దుస్తులు విప్పి యువతితో వీడియో కాల్ లో మాట్లాడాడు. అంతే వీడియోకాల్ ను రికార్డు చేసిన యువతి దాన్ని బహిరంగం చేస్తానని బెదిరించి అంబీట్ కుమార్ నుంచి 20వేల రూపాయలు గుంజింది. అనంతరం మళ్లీ లక్షరూపాయలు ఇవ్వాలని కిలాడీ లేడి బ్లాక్ మెయిల్ చేయడంతో అంబిట్ మిశ్రా బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంబీట్ మిశ్రా యువతిని వ్యక్తిగతంగా కలవలేదని, వీడియోకాల్ లోనే మాట్లాడి ఇలా ఛీటింగ్ చేసిందని బాధితుడు అంబీట్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో యువకుడిని మోసగించిన కిలాడీ లేడీపై మోసం, దోపిడీ కేసు నమోదు చేసిన పోలీసులు నయారకం మోసంపై దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-02-19T18:15:34+05:30 IST