Abn logo
Apr 28 2021 @ 14:40PM

ఛి ఛీ.. ఇదేం పనమ్మా? ఇంతటి అరాచకం ఎక్కడైనా ఉంటుందా..!

ఇంటర్నెట్ డెస్క్: సరసానికైనా కామెడీకైనా కాస్తంత హద్దు పద్దూ ఉండాలి. ఆటపట్టించడానికే అంటూ బుద్ధికి తోచిందల్లా చేసుకుంటూ పోతే చూసేవారికి అసహ్యం వేస్తుంది. కానీ.. కొందరికి ఇవ్వన్నీ పట్టవు. సోషల్ మీడియా వెర్రిలో పడిపోయి, కొత్తది ఏదో చేసేస్తున్నామనుకుంటూ పిచ్చి చేష్టలకు దిగి అభాసు పాలవుతుంటారు. సరిగ్గా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లు వాంతులు చేసుకునేలా చేస్తోంది. ‘‘ఇదేం పనమ్మా అంటూ ఆ వీడియోలోని యువతిపై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటారా..? ఏదైతే చేయకూడదో సరిగ్గా అదే చేసింది. ఇది చాలదన్నట్టు తన నిర్వాకాన్ని ఘనంగా సోషల్ మీడియాలో ప్రకటించుకుంది. 

పార్టీ ఉందంటూ స్నేహితులను ఇంటికి ఆహ్వానించిన సదరు యువతి.. కమ్మోడ్‌లో ఓ కూల్ డ్రింక్ తయారు చేసింది. ఆ తరువాత పార్టీకి వచ్చిన వారికి దీన్ని సర్వ్ చేసింది. కానీ తాను చేసిన పని గురించి మాత్రం వారికి చెప్పలేదు. జరిగిన అరాచకం గురించి తెలియని కొందరు.. పాపం.. ఆమె ఇచ్చిన కూల్ డ్రింక్‌ను టేస్ట్ చేశారు. అదృష్టవశాత్తూ..అది మొత్తం తాగేలోపే వారిలో ఒకరికి  విషయం తెలియడంతో మ్యాటర్ మొత్తం బయటపడిపోయింది. తాము ఏం తాగామో తెలుసుకున్న వారు పాపం.. నోట మాట రాకుండా అయిపోయారు. ఆ సమయంలో వారి ఫీలింగ్స్ చెప్పేందుకు భాష సరిపోదంటే అతిశయోక్తి కాదు! ఇది చాలదన్నట్టు.. సదరు యువతి పార్టీ అయిపోయాక వారి ఫొటోలను, కమ్మోడ్‌లో కూల్ డ్రింక్ తయారు చేస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. ‘‘పార్టీల్లో కిక్కిచ్చే మంచి పంచ్ ట్రిక్..దుమ్మురేపేయచ్చు’’ అంటూ ఓ క్యాప్షన్ కూడా జత చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతూ.. నెటిజన్లకు రోత పుట్టిస్తోంది. ‘‘అందుకే.. నేను పార్టీలకు వెళ్లను..వెళ్లినా వాళ్లు ఇచ్చింది తాగను’’ అంటూ ఈ వీడియో చూసిన కొందరు కామెంట్ చేశారు. ‘‘కమ్మోడ్‌లో కూల్ డ్రింక్ చేయడం దారుణామా లేక ఆ విషయం చెప్పకుండా అతిథులతో తాగించడం దారుణమా అనేది తేల్చుకోలేకపోతున్నా’’ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇటువంటి టాయి‌టెల్ బౌల్‌ వీడియోలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి అంటూ ఇంకొందరు నిర్వేదం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ లింక్ దిగువన ఉంది.. వార్తను ఆసాంతం చదివారు కాబట్టి..వీడియోలో ఏం ఉందో మీరు ఊహించుకోవచ్చు! చూసి తట్టుకోగలం అని అనుకుంటేనే ఈ వీడియోను చూడండి..!


Advertisement
Advertisement