Abn logo
Jan 17 2021 @ 11:50AM

భర్తకు విడాకులిచ్చి కొడుకుతో వివాహం.. ఇప్పుడు అతడితో ఓ బిడ్డను కూడా...

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళ తన కొడుకునే పెళ్లి చేసుకుని ఆ కొడుకుతోనే మరో కొడుకుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రష్యాలోని క్రాస్నాదర్ క్రాయికి చెందిన 35 ఏళ్ల మరియా అనే మహిళ 45 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిని పదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. అప్పటికే ఆ వ్యక్తికి పదేళ్ల బాబు ఉన్నాడు. పదేళ్ల కాపురం తరువాత మరియాకు తన భర్తతో వ్యక్తిగత మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో భర్తకు విడాకులిచ్చింది. అయితే, సవతి కొడుకు వ్లాదిమిర్ మాత్రం మరియాను విడిచి ఉండలేకపోయాడు. తరచూ కలుస్తూఉండేవారు.

అయితే కొన్నాళ్లుకు ఆమెకు అసలు విషయం తెలిసింది. అతడికి తనపై ఉన్నది తల్లిపై ఉండే ప్రేమ కాదని అర్థం చేసుకుంది. దీంతో అతడితో ఈ విషయంపై మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమె అంటే తనకిష్టమని వ్లాదిమిర్ చెప్పడంతో ఆమె కొంత ఆలోచనలో పడింది. కానీ చివరకు ఓకే చెప్పింది. దీంతో వ్లాదిమిర్ ఆనందానికి హద్దుల్లేవు. ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక తండ్రి కూడా ఒకే చెప్పాడు.

ఈ జంట అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు వీరికి సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే కొడుకుతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డతో ఉన్న ఫోటోను మరియా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వీరిద్దరి బంధంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

కొందరు ఆమె చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తుండగా.. మరికొందరు మాత్రం ఈ వివాహాన్ని, వారి బంధాన్ని సమర్థస్తున్నారు. సవతి కొడుకు కావడం, భర్తతో విడాకులు తీసుకోవడం వల్ల ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఈ వివాహంలో ఎలాంటి తప్పూ లేదని వారు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement