Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెల్లెలిని భర్తతో వివాహం చేసిన యువతి.. ప్రియుడి చెంతకు చేరడానికే ఇదంతా.. కానీ ఆమెకు ఊహించని షాక్

అచ్చు సినిమా స్టోరీని తలపించే ఒక ఘటన నిజజీవితంలో జరిగింది. ప్రియుడితో కలిసి జీవించాలనుకున్న ఒక వివాహిత తన భర్తతో తన చెల్లెలినిచ్చి వివాహం జరిపిచ్చింది. ఆ తరువాత ఆమె తను కోరుకున్న ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. కొద్ది కాలం తరువాత ఆమెకు తన చెల్లి ఊహించని షాక్ ఇచ్చింది. వివరాలలోకి వెళితే..


బీహార్ రాజధాని పట్నాలో నివసించే సుశీల(పేరు మార్చబడినది) తను ఉద్యోగం చేసే ఆఫీసులోని రణదీప్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. కానీ తల్లిదండ్రులు ఆమెకు మరో వ్యక్తితో వివాహం చేశారు. వివాహం జరిగిన కొద్ది కాలానికే సుశీల తన భర్తతో తన ప్రేమ వ్యవహారం చెప్పింది. తను మళ్లీ రణదీప్ వద్దకు వెళ్లిపోతానని.. అందుకోసం తనకు సహకరించాలని కోరింది. దానికి బదులుగా తన చెల్లెలు శ్రావ్యతో(పేరు మార్చబడినది) వివాహం ఆమె  జరిపిస్తానని చెప్పింది. దానికి సుశీల భర్త ఒప్పుకున్నాడు. ఆ తరువాత సుశీల చెల్లెలు శ్రావ్యతో ఆమె భర్త కోర్టులో వివాహం జరిగింది. 


సుశీల ఆ తరువాత తన బాయ్‌ఫ్రెండ్ రణదీప్‌తో సహజీవనం చేయసాగింది. కొద్ది కాలం గడిచాక రణదీప్.. సుశీలను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో సుశీల ఒంటరిగా మిగిలిపోయింది. ఎంతో మంచివాడైన భర్తను గుర్తుకు తెచ్చుకొని తన చెల్లెలు శ్రావ్య వద్దకు వెళ్లింది. మళ్లీ మునుపటి లాగే తన భర్తతో ఉంటానని అడిగింది. దానికి శ్రావ్య ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చట్టప్రకారం ఇంకా సుశీల తన భర్తతో విడాకులు తీసుకోకపోవడంతో ఆమెకు చట్టప్రకారం తన భర్తతో ఉండే హక్కు ఉందని ఆమె వాదించింది. గొడవ పెద్దదై అక్కచెల్లెళ్లు పోలీసుల వద్దకు వెళ్లారు.


ప్రస్తుతం మహిళ పోలీస్ స్టేషన్‌లో వారిద్దిరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement