Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్నానం చేస్తున్న వీడియో.. కాబోయే భర్తకు పంపబోయి పొరపాటున మరో ఫ్రెండ్‌కు వాట్సప్ చేసిన యువతి.. ఆ తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: పదిహేను రోజుల క్రితమే ఆమెకు నిశ్చితార్థం జరిగింది. కాబోయే భర్తతో సరసాలు ఆడటం మొదలైపోయింది. ఫోన్‌లో మాట్లాడుతూ మాటలతో సరసాలు ఆడుతూ చాలా ఉత్సాహంగా జీవనం సాగిపోతోంది. ఈ క్రమంలో కాబోయే భర్తను టీజ్ చేయాలనే ఆమె కోరిక మితిమీరింది. తాను స్నానం చేస్తూ వీడియో తీసింది. దాన్ని కాబోయే వాడికి పంపి, తన కోసం పిచ్చెక్కిపోయేలా చేయాలని అనుకుంది. కానీ ఒక చిన్న పొరపాటు ఆమె జీవితాన్ని మార్చేసింది. కాబోయే వాడికి పంపాల్సిన వీడియోను దురదృష్టవశాత్తూ తన స్నేహితురాలికి పంపిందామె. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగింది.


ఈ వీడియో చూసిన సదరు స్నేహితురాలు మొదట నవ్వుకున్నా... ఆ తర్వాత దాన్ని ఆ గ్రామంలో వైరల్ చేసేసింది. దీంతో కాబోయే పెళ్లి కూతురి పరువు పోయింది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి ఆమెను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోశారు. ఇలాంటి సమయంలో కాబోయే భర్త ఏమనుకుంటున్నాడో? అసలు తన పెళ్లి జరుగుతుందో లేదో? అనే భయంతో వణికిపోయిందామె. ఈ క్రమంలోనే ఏం చేయాలో తోచక విషం తాగేసింది. నోట్లో నుంచి నురగలు కక్కుతున్న ఆమెను చూసిన కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స జరుగుతుండగానే ఆ యువతి తుదిశ్వాస విడిచింది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement