ఫేస్ మాస్క్‌కు బదులు పెయింటింగ్... ఇద్దరు యువతుల పాస్‌పోర్ట్ సీజ్!

ABN , First Publish Date - 2021-04-27T12:01:09+05:30 IST

కరోనా వైరస్‌తో ప్రపంచం యావత్తూ అల్లాడిపోతోంది.

ఫేస్ మాస్క్‌కు బదులు పెయింటింగ్... ఇద్దరు యువతుల పాస్‌పోర్ట్ సీజ్!

జకార్తా: కరోనా వైరస్‌తో ప్రపంచం యావత్తూ అల్లాడిపోతోంది. శాస్త్రవేత్తలు, వైద్యులు కరోనా సోకకుండా ఉండాలంటే ప్రజలంతా మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే కొంతమంది మాస్క్ పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. పైగా మాస్క్ తమ అందానికి ఆటంకమని భావిస్తున్నారు. ఇదే విధమైన ఆలోచన కలిగిన ఇద్దరు యువతులు మాస్క్‌కు బదులు అదే తరహాలో ఫేస్ మీద పెయింటింగ్ వేయించుకున్నారు. అయితే ఈ విషయం అధికారుల ముందు బయటపడటంతో వారి పాస్‌పోర్టులు రద్దయ్యాయి. 


ఇండోనేషియాలోని బాలిలో ఇద్దరు యువతులు ప్రవర్తించడంతో వారి పాస్‌పోర్టులను సీజ్ చేశారు. వీరిద్దరూ మాస్క్ పెట్టుకునేందుకు బదులు ఫేస్‌కు పెయింటింగ్ వేయించుకున్నారు. జోష్ పాలర్ లిన్, లీయా అనే ఇద్దరు యువతులు ఏదో వీడియో తీసేందుకు సూపర్ మార్కెట్‌కు వచ్చారు. నీలి రంగు సర్జికల్ మాస్క్ మాదిరిగా ముఖానికి వారు పెయింటింగ్ వేయించుకున్నారు. వీరు తీసిన వీడియో వైరల్ అయ్యింది. అయితే ఈ వీడియోను చూసినవారు ఆ మహిళలు మాస్క్‌కు బదులు పెయింటింగ్ చేయించుకోవడాన్ని గమనించారు. ఇది చట్ట విరుద్దమని వారు ఆరోపించారు. ఈ నేపధ్యంలో ఇండోనేషియా అధికారులు ఆ మహిళలను గుర్తించి, వారి పాస్ పోర్టులను సీజ్ చేశారు. 

Updated Date - 2021-04-27T12:01:09+05:30 IST