ఆస్పత్రిలో చేరిన మర్నాడే మహిళ అదృశ్యం.. చివరికి ఘోరం

ABN , First Publish Date - 2021-06-10T13:48:18+05:30 IST

పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..

ఆస్పత్రిలో చేరిన మర్నాడే మహిళ అదృశ్యం.. చివరికి ఘోరం

  • 17 రోజుల తర్వాత మృతదేహం లభ్యం


హైదరాబాద్/చెన్నై : కరోనాతో బాధపడుతూ చెన్నై రాజీవ్‌గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో చేరిన మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆ ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజు ఆమె అదృశ్యం కాగా, 17 రోజుల తర్వాత ఎనిమిదో అంతస్తులో కుళ్లిన స్థితిలో ఆమె శవం లభించింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. స్థానిక మాంబళం ప్రాంతానికి చెందిన మౌళి హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 


ఆయన సతీమణి సుధ(41) కరోనా చికిత్స నిమిత్తం మే 22వ తేదీన చెన్నై జనరల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి మూడో టవర్‌ మూడో అంతస్తులోని కరోనా వార్డులో ఆమెకు వైద్యులు చికిత్సలందించారు. మరుసటి రోజు ఉదయం మౌళి భార్యను చూడటానికి వెళ్లినపుడు వార్డులో ఆమె కనిపించలేదు. ఆస్పత్రి అధికారులకు తెలిపి అన్ని విభాగాల్లోనూ వెతికారు. ఫలితం లేకపోవడంతో ఆ ఆస్పత్రి ప్రాంగణంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సుధ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆస్పత్రి 8వ అంతస్తులో సుధ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె మృతి చెందిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-10T13:48:18+05:30 IST