లిఫ్ట్ ఇస్తానని చెప్పి womanని కారులో ఎక్కించుకున్న స్నేహితుడు...ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-11-01T18:16:32+05:30 IST

లిఫ్ట్ ఇస్తానని చెప్పి 22 ఏళ్ల యువతిని కారులో ఎక్కించుకున్న ఓ స్నేహితుడు ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి తుపాకీ చూపించి బెదిరించి ఆమెపై అత్యాచారం చేసిన దారుణ...

లిఫ్ట్ ఇస్తానని చెప్పి womanని కారులో ఎక్కించుకున్న స్నేహితుడు...ఏం చేశాడంటే...

మొహాలి(పంజాబ్): లిఫ్ట్ ఇస్తానని చెప్పి 22 ఏళ్ల యువతిని కారులో ఎక్కించుకున్న ఓ స్నేహితుడు ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి తుపాకీ చూపించి బెదిరించి ఆమెపై అత్యాచారం చేసిన దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అక్టోబరు 29వతేదీ రాత్రి బస్సులో బర్నాలాలోని తన ఇంటి నుంచి మొహాలీకి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొహాలి జిల్లాలోని జిరాక్‌పూర్‌లో తన పేయింగ్ గెస్ట్ అకామడేషన్‌ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి 22 ఏళ్ల యువతిపై ఆమె స్నేహితుడే తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు.తనకు లిఫ్ట్ ఇవ్వమని కోరుతూ యువతి కుష్వీందర్ కు ఫోన్ చేసింది. 


దీంతో కుష్వీందర్ వచ్చి యువతిని కారులో ఎక్కించుకొని పీజీ వసతి గృహంలో దించకుండా ఏకాంత ప్రదేశానికి తీసుకువెళ్లి తుపాకీ చూపించి బెదిరించి అత్యాచారం చేసి రోడ్డు పక్కన వదిలేశాడు. బాధిత యువతి క్యాబ్ కు ఫోన్ చేసి పీజీవసతి గృహానికి చేరుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదుపై పోలీసులు భటిండాకు చెందిన కుష్వందర్ పై ఐపీసీ సెక్షన్ 376, 365,506 ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసుబలగాలు గాలిస్తున్నాయి. 

Updated Date - 2021-11-01T18:16:32+05:30 IST