UP: యువతిపై పోలీసు అంకుల్ అత్యాచారం

ABN , First Publish Date - 2021-09-14T18:13:28+05:30 IST

స్వయానా మామ అయిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఘటనతో బాధితురాలైన ఇరవై ఐదేళ్ల యువతి గంగా నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ లో వెలుగుచూసింది...

UP: యువతిపై పోలీసు అంకుల్ అత్యాచారం

గంగలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్): స్వయానా మామ అయిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఘటనతో బాధితురాలైన ఇరవై ఐదేళ్ల యువతి గంగా నదిలో దూకి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ లో వెలుగుచూసింది.గత రెండేళ్లుగా తన మామ అయిన హెడ్ కానిస్టేబుల్ అత్యాచారం చేశాడనే ఆవేదనతో 25 ఏళ్ల యువతి గంగానదిలో దూకగా తమ పోలీసులు రక్షించారని మీర్జాపూర్ డీసీపీ ప్రమోద్ కుమార్ చెప్పారు.2019 జనవరి నెలలో కుంభమేళా కోసం తమ కుటుంబాన్ని అలహాబాద్ కు ఆహ్వానించాడని బాధితురాలు చెప్పారు. అప్పుడు తనను హోటల్ కు తీసుకువెళ్లి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చి అపస్మారక స్థితిలోకి చేరాక, అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వీడియో చిత్రీకరించాడని బాధితురాలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.


గత రెండు సంవత్సరాలుగా అలహాబాద్, కాన్పూర్‌లలో తన మామ తనపై అనేకసార్లు అత్యాచారం చేశాడని ఆ మహిళ పేర్కొంది.తాను గర్భం దాల్చానని తెలుసుకొని మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేసుకోవాలని సూచించాడు. మళ్లీ మామ, అతని కుమారుడు గదికి తీసుకువెళ్లి మరో వీడియో తీసి, తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. తాను ప్రతిఘటించగా వారు తనను కొట్టారని, దీంతో తాను పోలీసు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి నదిలో దూకానని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేర హెడ్ కానిస్టేబుల్ తోపాటు అతని కుమారుడిపై కేసు నమోదు చేశామని డీసీపీ చెప్పారు. నిందితుడైన పోలీసు హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, బాధిత మహిళను వైద్యపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని డీసీపీ వివరించారు.

 

Updated Date - 2021-09-14T18:13:28+05:30 IST