Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేను నీ భార్యకు మాజీ ప్రియుడిని.. ఇంట్లోకి వచ్చి మరీ భర్తకు ఓ యువకుడు చెప్పిన మాటలివి.. చివరికి..

యుక్త వయసులో తెలిసి తెలియక చేసిన తప్పులు.. కొన్ని సార్లు మనిషి జీవితంలో కష్టాలు తెచ్చిపెడతాయి. ఒక్కోసారి వినాశనం వరకూ తీసుకెళతాయి. అలాంటి తప్పునే మధ్యప్రదేశ్‌కు చెందిన మిహిక(22, పేరు మార్చబడినది) చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ నగరంలో నివసించే మిహికకు 14 సంత్సరాలు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో ఆమె ఒంటరిగా మారింది. తల్లిదండ్రులిద్దరూ ఆమెను పట్టింకోకపోవడంతో చిన్న వయసులోనే మిహిక ఉద్యోగం చేయడం ప్రారంభించింది. అలా ఆమెకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు అమిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ కొద్దికాలం సహజీవనం కూడా చేశారు. కానీ  ఆ తరువాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు.


మిహిక ఉద్యోగం కోసం జబల్‌పూర్ వదిలి ఇందోర్ నగరం వచ్చేసింది. ఆమెకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇందోర్‌లోనే ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరూ గత రెండు సంత్సరాలు సంతోషంగా ఉన్నారు. మిహిక ఒక పాపకు జన్మనిచ్చింది. అంతా బాగుందనకున్న వేళ.. హఠాత్తుగా ఒక రోజు మిహిక ఇంట్లో లేని సమయంలో అమిత్ అక్కడికి చేరుకున్నాడు. మిహిక భర్తతో తాను మిహిక మాజీ ప్రియుడిని అని పరిచయం చేసుకొని.. ఆమెకు సంబంధించిన కొన్ని అశ్లీల చిత్రాలు చూపించాడు. ఆ తరువాత మిహిక ఇంటికి రాగా.. ఆమె భర్త గొడవపడి ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. తరువాత అతను ఎప్పుడూ తిరిగిరాలేదు.


కొద్దికాలం తరువాత తన కూతురితో ఒంటరిగా ఉన్న మిహిక జీవితంలోకి మళ్లీ అమిత్ ప్రవేశించాడు. ఆమెను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నానని చెప్పి మిహికను నమ్మించాడు. తన తోడుగా ఎవరూ లేకపోవడంతో మిహిక తన కూతురిని చూసుకోవడానికి మళ్లీ అమిత్‌తో సహజీవనం మొదలుపెట్టింది. అలా వారిద్దరికీ ఒక పాప పుట్టింది. ఇద్దరు కూతుర్లతో మిహిక అమిత్‌తో కలిసి జీవితం సాగిస్తుండగా.. ఒకరోజు అమిత్ ఒక నీచమైన పని చేశాడు. తన ముగ్గురు స్నేహితులను ఇంటికి పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఆ రోజు మిహికకు మత్తు కలిపిన కూల్ డ్రింక్స్ తాగించాడు. ఆ తరువాత అమిత్ ముగ్గురు స్నేహితులు మిహికపై అత్యాచారం చేశారు. మరుసటి రోజు మిహిక అమిత్‌తో గొడవ పడింది.. కానీ ఫలితం లేకపోయింది. తన ఇద్దరు పిల్లల కోసం తనకు జరిగిన అన్యాయాన్ని సహించింది. కానీ అమిత్ దుర్బుద్ధి మాత్రం మారలేదు.


కొన్ని రోజుల తరువాత తనకు మెహర్ అనే గ్రామంలో మంచి పని దొరికిందని చెప్పి మిహికను అక్కడికి తీసుకెళ్లాడు. ఈ సారి మిహికను ముందుగానే మత్తు పానీయం ఇచ్చాడు.  ఆ తరువాత అమిత్ ముగ్గురు స్నేహితులు మళ్లీ ఆమెపై అత్యాచారం చేశారు. మిహిక ఇక తాను సహించలేనని నిర్ణయించుకొని పోలీస స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అమిత్, అతని ముగ్గురు స్నేహితులపై అత్యాచారం కేసు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. అమిత్ లాంటి దుర్మార్గుడి కారణంగా ప్రస్తుతం మిహిక తన ఇద్దరు పిల్లలతో నిస్సహాయ స్థితిలో జీవితం సాగిస్తోంది.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement