Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమ్మో..! ఈ లేడీ జగత్ కిలాడీ.. నకిలీ రిటైల్ కూపన్లతో ఏకంగా కోట్లు కొల్లగొట్టింది

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఓ మహిళ భారీ మోసానికి తెర తీసింది. ఎవరూ ఊహించని విధంగా కోట్లు కొల్లగొట్టింది. దాదాపు 3 ఏళ్లు కొనసాగిన ఆమె దందా వల్ల సుమారు రూ.3 కోట్ల వరకు వెనకేసుకుంది. అయితే ఆమె చేసిన ఓ చిన్న తప్పువల్ల అనేక కంపెనీలకు జరిగిన నష్టం మాత్రం దానికి పది రెట్లుగా ఉన్నట్లు తేలింది. అయితే ఎంతపెద్ద దొంగ అయినా ఏదో ఒక చోట తప్పటడుగు వేస్తారు. అదే చేసిన ఆమె పోలీసులకు చిక్కింది. ఆమెకు సాయం చేసిన భర్తను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అమెరికాలోని లోరి అన్న టాలెన్స్(41) అనే మహిళ తన భర్త పసిఫికో టాలెన్స్‌తో కలిసి నకిలీ రీటైల్ కూపన్ల దందాను మొదలు పెట్టింది. రీటైల్ రంగంలో తనకున్న అనుభవంతో ఫ్రాంకెన్‌స్టైన్ పేరుతో నకిలీ కూపన్లను తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో అమ్మకానికి ఉంచింది. అలాగే 2017-20 మధ్య కాలంలో ‘మాస్టర్‌చెఫ్’ పేరుతో ఓ నకిలీ కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 2 వేల మందికి తన నకిలీ కూపన్లను విక్రయించింది. ఈ కూపన్లను కొనుగోలుదారులకు అందజేయడంలో ఆమె భర్త సాయం చేశాడు. ఈ మోసం ద్వారా 4 లక్షల డాలర్లు(రూ.3 కోట్లకు పైగా) సంపాదించింది.

అయితే ఎంత పెద్ద తప్పు చేసినా నిందితులు ఎక్కడో ఓ చోట అనుకోకుండా తప్పటడుగు వేస్తారు. టాలెన్స్ కూడా అదే చేసింది. తన కూపన్ల విలువ విషయంలో ఆమె తప్పు చేసింది. ఒక్కో కూపన్‌ విలువ భారీగా ఉంచింది. ఆమె తక్కువకే విక్రయించినా.. ఆ కూపన్లోని ధర సదరు వస్తువు ధరకు ఎక్కువగా లేదా.. సరిసమానంగా ఉంది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు దర్యాప్తు ప్రారంభించడంతో టాలేన్స్ బాగోతం బయటపడింది. టాలెన్స్ నకిలీ కూపన్ల వల్ల ఆయా సంస్థలకు 31 మిలియన్ డాలర్లు(రూ.220 కోట్లకు పైగా) నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.

TAGS: FRAUD America

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement