రెండు మర్మాంగాలతో పుట్టానని నాకు 16 ఏళ్ల తర్వాతే తెలిసింది.. అంత ఈజీ కాదంటూ షాకింగ్ నిజాలు చెప్పిన యువతి..!

ABN , First Publish Date - 2021-10-17T02:54:40+05:30 IST

అప్పటిదాకా ఆ బాలికకు తెలీనే తెలిదు.. తనకు రెండు మర్మాంగాలు ఉన్నాయని. మహిళలందరికీ రెండు యోనులు ఉంటాయనుకుంది. ఓ రోజు అనుకోకుండా ఆమెకు

రెండు మర్మాంగాలతో పుట్టానని నాకు 16 ఏళ్ల తర్వాతే తెలిసింది.. అంత ఈజీ కాదంటూ షాకింగ్ నిజాలు చెప్పిన యువతి..!

ఇంటర్నెట్ డెస్క్: అప్పటిదాకా ఆ బాలికకు తెలీనే తెలీదు.. తనకు రెండు మర్మాంగాలు ఉన్నాయని. మహిళలందరికీ రెండు యోనులు ఉంటాయనుకుంది. ఆమెకు 16 ఏళ్ల వయసున్నప్పుడు ఓ రోజు అనుకోకుండా తన పరిస్థితి గురించి ఆమెకు తెలిసొచ్చింది. దీంతో.. ఆమెకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్న ఆమె పేరు టీ బార్ట్‌లెట్. ఆస్ట్రేలియా వాసి. ఇప్పుడు ఆమెకు 24 ఏళ్లు. ఇటీవల ఆమె సోషల్ మీడియా ద్వారా ఆ వివరాలను పంచుకుంది. 


రజస్వల అయ్యాక కూడా ఇటువంటి విషయాల గురించి టీ తన తల్లితో పెద్దగా చర్చించేది కాదు. అసలు అలాంటి విషయాలు మాట్లాడాలంటేనే ఆమెకు బోలెడంత సిగ్గు. అయితే..ఓ రోజు నెలసరి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆమె తన తల్లితో చర్చిస్తోంది. ఈ క్రమంలో టాంపాన్‌ల ప్రస్తావన వచ్చింది. వాటిని ఎలా వినియోగించాలి..అంటూ టీ తన తల్లిని అడగడంతో వారి సంభాషణ అనూహ్య మలుపు తిరిగింది. అప్పటికి టీకి అర్థమైంది..తాను ఓ అసాధారణ స్థితిలో ఉన్నానని! వెంటనే టీని తీసుకుని ఆమె తల్లి వైద్యులను సంప్రదించింది. ఇద్దరు వైద్యులు.. టీ చెబుతున్నదంతా విని ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు చూశారు. మూడో వైద్యుడు మాత్రం.. గైనకాలజిస్టును కలవాలని టీకి సూచించాడు. ఈ క్రమంలోనే టీ వెజైనల్ సెప్టమ్ అనే సమస్యతో బాధపడుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. 


గర్భంలో ఉండగా ఈ సమస్య మొదలవుతుంది. యోని మార్గాన్ని రెండుగా చీలుస్తూ కణజాలం ఒకటి అడ్డుగోడలా ఏర్పడుతుంది. పిండం ఎదుగుదలలో ఇదీ ఒక పరిణామం. శిశువు పెరిగే కొద్దీ ఈ కణజాలం కరిగిపోయి పునరుత్పత్తి వ్యవస్థ సాధారణ స్థితికి వస్తుంది. కానీ.. వెజైనల్ సెప్టమ్ ఉన్న వారిలో మాత్రం పుట్టిన తరువాత కూడా ఈ గోడ అలాగే ఉండిపోయి..రెండు యోనులు ఉన్నట్టు అనిపిస్తుంది. 


కాగా.. ఈ పరిస్థితికి శస్త్రచికిత్స ఒక్కటే మార్గం కావడంతో టీ మరుసటి ఏడాది చికిత్స చేయించుకుని ఈ సెప్టమ్(గోడ)ను తొలగించుకుంది. అప్పటి వివరాలను ఇటీవలే సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ విషయం చెప్పగానే ఎందరో యువతులు తమకూ ఇలాంటి సమస్య ఉన్నట్టు తెలిపారని టీ పేర్కొంది. అంతేకాకుండా.. బాలికలు తమ సమస్యలను ఆప్తులకు, కుటుంబసభ్యులకు చెప్పుకొనేందుకు వెనకాడకూడదని ఈ సందర్భంగా ఆమె సూచించింది. 

Updated Date - 2021-10-17T02:54:40+05:30 IST