Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫారెస్ట్ అధికారుల ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ ఏజెన్సీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు, గిరిజన రైతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అటవీ భూములు ఆక్రమించుకున్నారంటూ అధికారులు స్వాధీనానికి యత్నించడంతో ఉద్రిక్తత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా, భీమ్‌గల్‌ మండలంలో గిరిజన మహిళా రైతు ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది. గంగరాయి తండా శివారులోని సౌత్‌ బీట్‌ కంపార్ట్‌మెంట్‌ 71లో గల రెండెకరాల పోడు భూమిలో అటవీ అధికారులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వారు. ఇదే భూమిని 20 ఏళ్లుగా మహిళ రైతు మాలావత్‌ జ్యోతి కుటుంబం సాగు చేసుకుంటోంది. అధికారులు గుంటలు తవ్వుతున్న విషయం తెలుసుకున్న ఆమె వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అధికారులను వేడుకుంది. 2012లో అధికారులు తనకిచ్చిన భూమి పత్రాలను కూడా చూపించింది. అయినా అధికారులు వినకపోవడంతో వారి ముందే పురుగుల మందు తాగింది. దీంతో తోటి రైతులు జ్యోతిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అధికారులపై తండా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement