Abn logo
Oct 20 2021 @ 11:07AM

పిల్లలను స్కూలుకు పంపాక.. మరొకరితో ఇష్టాపూర్వక సంబంధాలు ఏర్పరుచుకుంటున్న మహిళ.. సహకరిస్తున్న భర్త!

ఇటీవలికాలంలో స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. లైంగిక స్వేచ్ఛను వివిధ రకాలుగా ఆస్వాదించాలని కొన్ని జంటలు ఉవ్విళ్లూరుతున్నాయి. జీవిత భాగస్వాముల మార్పిడి(పార్ట్‌నర్ స్వాపింగ్), భార్యాభర్తలలో ఎవరో ఒకరు మరొకరితో ఇష్టాపూర్వక లైంగిక సంబంధం ఏర్పరుచుకోవడం(స్వింగింగ్) తరహా కాన్సెప్ట్ గురించి వినగానే భారతీయులకు వింతగా అనిపిస్తుంది. అయితే విదేశాల్లో ఇటువంటి రిలేషన్‌షిప్ కాన్పెప్ట్స్ అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఒక మహిళ ఇటువంటి ఇష్టాపూర్వక లైంగిక సంబంధాలను ఏర్పరుచుకుంటూ వార్తల్లో నిలిచింది. పైగా ఆమె తాను స్వింగర్ ఉమెన్‌‌గా పనిచేస్తున్నానని గర్వంగా చెప్పుకుంటుంది. 

ఈ కొత్త వృత్తిలో విజయం సాధించానని చెబుతుంటుంది. లింక్‌షైర్ ప్రాంతానికి చెందిన ఈ 29 ఏళ్ల మహిళ సోషల్ మీడియా సైట్‌లో విస్టా వైప్‌గా పేరొందింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈమె ఇతర జంటలలోని పురుషులతో ఇష్టాపూర్వక లైంగిక సంబంధాలను ఏర్పరుచుకుంటుంది. పైగా ఇటువంటి విధానంలో ఉన్న అనుభూతిని ఇతరులకు చెబుతుంటుంది. భర్త కూడా ఆమెకు సహకారం అందిస్తూ, అతను కూడా ఇదే పని చేస్తుంటాడు. వీరిద్దరూ కలిసి పార్ట్‌నర్ స్వాపింగ్, స్వింగింగ్ చేస్తుంటారు. ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను పిల్లలను స్కూలుకు పంపాక, భర్తతో కలసి ఇతర జంటల దగ్గరకు వెళ్లి, తాము అందించే సేవల గురించి వారికి తెలియజేస్తామన్నారు. వీరు ఇటీవలే ఒక స్వింగింగ్ వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. దానికి విస్టావైఫ్ డాట్ కామ్ అనే పేరు పెట్టారు. ఈ జంటకు వివాహం జరిగి చాలా ఏళ్లు గడిచింది. ఉద్యోగాలతో తగినంత ఆదాయం రాకపోవడంతో వారు ఈ పనిని ప్రారంభించారు. ఈ పనిలో తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...