కొద్ది రోజుల క్రితమే పెళ్లి.. లక్షలు ఖర్చు పెట్టి హనీమూన్‌కు బయల్దేరారు.. కానీ ఇంతలోనే..

ABN , First Publish Date - 2021-09-30T02:53:34+05:30 IST

పెళ్లైన నూతన జంటకు హనీమూన్.. ఓ అద్భుత ప్రపంచం. ఆ కొన్ని రోజులు గడిపిన క్షణాలు.. వారి జీవితాంతం గుర్తుంటాయి. కొత్త ప్రపంచంలో, ఎవరో తెలీని ప్రాంతంలో.. కొత్త జంట వారి వారి అనుభూతులను పంచుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది.

కొద్ది రోజుల క్రితమే పెళ్లి.. లక్షలు ఖర్చు పెట్టి హనీమూన్‌కు బయల్దేరారు.. కానీ ఇంతలోనే..

పెళ్లైన నూతన జంటకు హనీమూన్.. ఓ అద్భుత ప్రపంచం. ఆ కొన్ని రోజులు గడిపిన క్షణాలు.. వారి జీవితాంతం గుర్తుంటాయి. కొత్త ప్రపంచంలో, ఎవరో తెలీని ప్రాంతంలో.. కొత్త జంట వారి వారి అనుభూతులను పంచుకోవాలని తహతహలాడుతూ ఉంటుంది. వారివారి తాహత్తుకు తగ్గట్టుకు హనీమూన్‌ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ధనికులైతే లక్షలకు లక్షలు ఖర్చు చేసి హనీమూన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ కొత్త జంట కూడా లక్షలు ఖర్చు చేసి హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు. సామాన్లు సర్దుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే అనుకోని ఘటనతో షాక్ తిన్నారు. వివరాల్లోకి వెళితే.. విమానాశ్రయం



పశ్చిమ లండన్‌లోని కిస్విక్ ప్రాంతాని చెందిన అమీ(27), అల్బెర్టో(33)‌లు మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. హనీమూన్ వెళ్దామని నిర్ణయించుకున్నారు. హనీమూన్ ఎలా ఉండాలి, ఏ విధంగా గడపాలి, ఎన్ని రోజులు ఉండాలి.. ఇలా ఏవేవో ఆలోచనలతో బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నిబంధనల ప్రకారం పీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్ కోసం వెయిట్ చేయమని సిబ్బంది వారితో చెప్పారు. తర్వాత ఆ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. అల్బెర్టోకు కరోనా నెగిటివ్‌ కాగా, అమీ రిపోర్ట్ కరోనా పాజిటివ్‌గా తేలింది.


దీంతో ఆమెకు సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు అక్కడే ఉంది. తర్వాత ఆమెను ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. పది రోజులు పాటు ఆమెను అక్కడే ఉండాలని సూచించారు. ఎన్నెన్నో ఊహలతో హనీమూన్ బయలుదేరిన ఆమె.. చివరకు ఎవరో తెలీని ఆరుగురితో కలిసి ఆ గదిలో ఉండాల్సి వచ్చింది. ఇదిలావుంటే అక్కడ కనీసం నీటి వసతి, టాయిలెట్స్ కూడా సరిగా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 


ఇక, ఆ రోజు రాత్రి మొత్తం అమీ తన భర్తతో మాట్లాడుతూనే ఉంది. అమీ పరిస్థితి చూసి ఆమె భర్త అల్బెర్టోకు అధికారులపై కోపం వచ్చింది. వెంటనే ఆమెను ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఒక్క రోజుకు రూ. 40 వేలు చెల్లించాల్సి వచ్చింది. వార్డు ఫీజు రూ. 22,000, డాక్టర్ ఫీజు రూ. 18,000గా చెల్లిస్తూ వచ్చారు. మరోవైపు అల్బెర్టో తన సెల్ఫ్ ఐసోలేషన్ కోసం చిన్న గదిలో గడపాల్సి వచ్చింది. 


హనీమూన్ కోసమని ఆ జంట ముందుగానే బుక్ చేసుకున్న హోటల్ యజమాన్యం.. వారి డబ్బులను రీఫండ్ చేయలేదు. దీంతో చేసేదిలేక.. పరిస్థితులు చక్కబడిన తర్వాత వారు తిరిగి తమ స్వస్థలానికి చేరుకున్నారు. హనీమూన్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని లక్షలాది రూపాయలు వృథా చేసుకున్నారు. వారి జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలవాల్సిన ట్రిప్.. చేదు అనుభవంగా మారింది. తీవ్ర నిరాశతో స్వస్థలానికి చేరుకున్న ఆ జంట.. రోజు వారి పనుల్లో పడిపోయారు. 

Updated Date - 2021-09-30T02:53:34+05:30 IST