చాణక్యనీతి: ఈ 4 గుణాలు భార్యలో ఉంటే.. భర్త అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరు.. కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి!

ABN , First Publish Date - 2021-10-24T12:23:55+05:30 IST

ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు..

చాణక్యనీతి: ఈ 4 గుణాలు భార్యలో ఉంటే.. భర్త అదృష్టాన్ని ఎవరూ అడ్డుకోలేరు.. కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి!

ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాలు ఈనాటికీ  ప్రామాణికమైనవిగా నిలుస్తున్నాయి. వీటిని అనుసరించడం ద్వారా, ఎవరైనాసరే జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. చాణక్యుని తెలివితేటల కారణంగానే చంద్రగుప్తమౌర్య రాజు అయ్యాడు. ఆచార్య చాణక్య మహిళలకు సంబంధించిన అనేక విశేషాలను తెలియజేశారు. వాటిలో పెళ్లయిన స్త్రీకి ఉండాల్సిన నాలుగు లక్షణాల గురించి వివరించారు. ఈ లక్షణాలు కలిగిన స్త్రీ తన భర్తకు అదృష్టం తెచ్చిపెట్టేదిగా మారుతుందన్నారు. ఆ లక్షణాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 


ధైర్యం: చాణక్య తెలిపిన వివరాల ప్రకారం ధైర్యగుణం కలిగిన స్త్రీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భర్తను విడిచిపెట్టి వెళ్లదు. ధైర్యగుణం కలిగివుంటే, ఎవరైనా ఎటువంటి పెద్ద సమస్య ఎదురైనా, దాని నుండి సులభంగా బయటపడగలుగుతారు. ధైర్యం కలిగిన మగువ భర్తకు అదృష్టవంతురాలిగా మారుతుంది. మనిషిలో అమితమైన ధైర్యం ఉంటే చెడ్డరోజులు రోజులు త్వరగా దూరమవుతాయి.

ధర్మగుణం: చాణక్య విధానం ప్రకారం ధార్మికగుణం కలిగిన స్త్రీ కూడా భర్తకు అదృష్టాన్ని అందిస్తుందని చాణక్య చెబుతారు. ఎందుకంటే ధర్మంపై నమ్మకం కలిగివారు ఎప్పుడూ తప్పుడు మార్గంలో నడవరు. ధర్మంపై నమ్మకం కలిగినవారికి జీవితంలో అశాంతి ఎదురవదు. ధర్మమార్గంలో నడిచేవారు అన్నిరంగాలలోనూ విజయం సాధిస్తారు.


శాంతం: శాంత స్వభావం కలిగిన స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి తన అదృష్టాన్ని రెట్టింపు చేసుకుంటాడని ఆచార్య చాణక్య చెబుతారు. శాంత స్వభావం కలిగిన స్త్రీ తన ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అన్ని పరిస్థితులను తన శాంత స్వభావంతో ఎదుర్కొంటుంది.

మధురమైన వాక్కు: చాణక్య జీవన విధానం ప్రకారం, మాట్లాడటంలో, నడవడికలో మంచితనం కలిగిన స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు అదృష్టవంతుడవుతాడు. మధురంగా మాట్లాడే స్త్రీ తన భర్త జీవితాన్ని స్వర్గంలా మారుస్తుంది. 

Updated Date - 2021-10-24T12:23:55+05:30 IST