Advertisement
Advertisement
Abn logo
Advertisement

భవనంలో అగ్నికీలలు.... పిల్లాడిని కిందకు విసిరేసిన తల్లి... వీడియో వైరల్!

కేప్‌టౌన్: దక్షిణ ఆఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జూమా అరెస్టు అనంతరం దేశంలోని పలు పట్టణాలలో హింసాయుత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ 70 మంది ప్రాణాలు కోల్పోయారు.

అక్కడి పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే... ఒక మహిళ... దగ్ధమవుతున్న బిల్డింగ్‌లో తాను ప్రాణాపాయ స్థితిలో ఉంటూ కూడా... తన కుమారుని ప్రాణాలు కాపాడేందుకు ఆ చిన్నారిని కిందకు విసిరేసింది. డర్బన్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణాలకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో భవనం అంతటా మంటలు వ్యాపించాయి. ఇదే భవనంలో ఉంటున్న మహిళ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఆ బాలుడిని కిందకు విసిరేసింది.  అప్పటికే కిందనున్నవారు ఆ బాలుడిని పట్టుకుని ఆ చిన్నారిని కాపాడారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

                                     ‘ది టెలిగ్రాఫ్’ సౌజన్యంతో...

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement