Advertisement
Advertisement
Abn logo
Advertisement

మేడమ్.. నేను పేదవాడిని.. అలా చేయకండి.. అంటున్నా వినకుండా ఆ మహిళ ఎంత పని చేసిందంటే.. బండి మీద పళ్లు తీసి..

ఆమె యూనివర్సిటీలో ప్రొఫెసర్.. లక్షల్లో జీతం.. రోజూ కారులో తిరుగుతుంటుంది.. ఈ నెల పదో తేదీన ఆమె కారుకు రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండి తగిలింది.. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహానికి గురైంది.. పేదవాడిపై తన ప్రతాపాన్ని చూపించింది.. అతడి బండి మీద ఉన్న పళ్లు అన్నింటినీ తీసి రోడ్డు మీదకు విసిరేసింది.. `మేడమ్.. అలా చేయకండి.. మీ డ్యామేజ్‌కు అయిన డబ్బులు ఇచ్చేస్తానంటున్నా` ఆమె వినలేదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఈ ఘటన జరిగింది. `మేడమ్.. నేను పేదవాడిని.. మీరు అలా చేస్తే నాకు చాలా నష్టం వస్తుంది.. మీ కారుకు జరిగిన నష్టానికి నేను డబ్బులు ఇచ్చేస్తాన`ని ఆ వ్యాపారి బతిమాలుకున్నాడు. అయినా ఆమె కనికరించలేదు. ఆగ్రహంతో ఊగిపోతూ పళ్లు అన్నింటినీ తీసి రోడ్డు మీదకు విసిరేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో మహిళ సరిగ్గా కనిపించలేదు. అయితే కొందరు ఆ మహిళకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


ఆమె భోపాల్‌లోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అని చెప్పారు. ఈ వీడియోపై పలువురు ఉన్నతాధికారులు కూడా స్పందించారు. `ఆ వీడియోలోని మహిళను, వ్యాపారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామ`ని భోపాల్ కలెక్టర్ ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement