Abn logo
Sep 24 2021 @ 12:36PM

`ఆహ్వానం` సినిమాలో రమ్యకృష్ణలా.. విడాకుల మహోత్సవం.. 17 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ అంటూ సెలబ్రేట్ చేసుకున్న మహిళ..

మీరు `ఆహ్వానం` సినిమా చూశారా? ఆ సినిమాలో రమ్యకృష్ణ విడాకుల మహోత్సవం అంటూ అందర్నీ ఆహ్వానిస్తుంది.. ఆ సినిమాలో బాధతో విడాకుల మహోత్సవం నిర్వహిస్తే.. తాజాగా ఓ మహిళ అత్యంత సంతోషంగా డివోర్స్ పార్టీ చేసుకుంది.. రంగురంగుల బట్టలు ధరించి స్నేహితులు, బంధువులతో కలిసి చిందులేసింది.. 17 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ అంటూ సెలబ్రేట్ చేసుకుంది.. ఆ మహిళ పేరు సోనియా గుప్తా.. ఆమె వయసు 45 సంవత్సరాలు.


2003లో ఈమెకు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లికి ముందు ఎంతో సరదాగా జీవితం గడిపిన సోనియా.. వివాహం తర్వాత ఇంటికే పరిమితమైంది. తన సరదాలన్నీ వదులుకుని నిరాశగా జీవితాన్ని గడిపింది. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించింది. మూడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఆమెకు విడాకులు మంజూరు చేసింది. 


ఇవి కూడా చదవండి

ఆమె తిరస్కరించిందని అతను ఎంతటి నీచానికి తెగించాడంటే..



పొట్టిగా ఉన్నావంటూ విడాకులు కోరిన భర్త..

ఈ నేపథ్యంలో ఆమె గత బుధవారం బంధువులను, స్నేహితులను పిలిచి గ్రాండ్ పార్టీ చేసుకుంది. `17 ఏళ్ల తర్వాత నాకు స్వేచ్ఛ లభించింది. నా కలర్‌ఫుల్ జీవితం నాకు మళ్లీ తిరిగి వచ్చింది. నా నిర్ణయాన్ని సమర్థించిన తల్లిదండ్రులకు, నా పిల్లలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. విడాకుల తర్వాత జీవితం ఉండదని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, నా జీవితం ఇప్పుడే ప్రారంభమైంది. జీవితం ఎంత సరదాగా ఉంటుందో అందరికీ చూపిస్తాన`ని ఆమె చెప్పింది.  

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...