బికినీలో ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళ మాస్క్‌ను మరచిపోలేదు!

ABN , First Publish Date - 2021-09-04T17:53:04+05:30 IST

అమెరికాలోని మియామీ ఎయిర్ పోర్టుకు...

బికినీలో ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళ మాస్క్‌ను మరచిపోలేదు!

వాషింగ్టన్: అమెరికాలోని మియామీ ఎయిర్ పోర్టుకు ఒక మహిళ కేవలం బికినీతో రావడాన్ని చూసిన అక్కడున్నవారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. భుజానికి బ్యాగు తగిలించుకున్న ఆ మహిళ గ్రీన్ కలర్ బికినీ ధరించి, వయ్యారంగా నడుస్తూ వచ్చింది. ఆమె ఒక విమానం ఎక్కాల్సివుంది. సోషల్ మీడియాలో ఈ ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒక యూజర్ ఆమెను అభినందిస్తూ, కనీసం మాస్క్ అయినా ధరించారంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు.  


కాగా ఈ మహిళ ఎవరు, ఎక్కడుంటారనే వివరాలు వెల్లడికాలేదు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సదరు మహిళ టూ పీస్ స్విమ్ సూట్ ధరించి, మియామీ ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడున్నవారి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా అక్కడున్న ప్రయాణికులెవరో ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ఈ ఉదంతంపై స్పందించిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్.., ఈ వీడియో నిజం కాదని పేర్కొంది. బికినీ ధరించి ప్రయాణికులెవరూ విమానాశ్రయానికి రాలేదని స్పష్టం చేసింది.

Updated Date - 2021-09-04T17:53:04+05:30 IST