Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇల్లు ఖాళీ చేస్తానన్న మహిళ.. ఆగ్రహంతో ఊగిపోయిన ఇంటి ఓనర్ ఎంత పని చేశాడంటే..

ఆ మహిళ ఇల్లు ఖాళీ చేయాలనుకుంది.. ఆ విషయమే ఇంటి యజమానితో చెప్పింది.. వచ్చే నెలలో వేరే ఇంటికి మారతామని చెప్పింది.. అద్దె విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.. ఆగ్రహంతో ఊగిపోయిన యజమాని తుపాకీ తీసుకొచ్చి ఆమెను నాలుగు సార్లు కాల్చాడు.. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోంది.. 


ఉత్తరప్రదేశ్‌లోని దుమాన్‌గంజ్ ప్రాంతంలో అభిమన్యు శుక్లా అనే వ్యక్తికి ఓ అపార్ట్‌మెంట్ ఉంది. అందులోని ఫ్లాట్లలో చాలా కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఒక ఫ్లాట్‌లో సంగీత అనే మహిళ నివసిస్తోంది. వచ్చే నెలలో ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారాలనుకుంది. ఆ విషయమే యజమాని అభిమన్యుకు చెప్పింది. అద్దె విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అభిమన్యు ఆగ్రహానికి గురయ్యాడు. 


ఇంట్లో నుంచి తుపాకీ తెచ్చి ఆమెను నాలుగు సార్లు కాల్చాడు. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలైంది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. శరీరం నుంచి 4 బుల్లెట్లు తీసిన వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement