Abn logo
Sep 27 2021 @ 07:30AM

అబార్షన్ చేసుకోవడం ఎలా.. అని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూసి.. 24 ఏళ్ల ఓ యువతి ఎంత పని చేసిందంటే..

నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఒళ్లు జలదరించే ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు చూసి స్వయంగా అబార్షన్ చేసుకుంది. ఈ 24 ఏళ్ల మహిళ అత్యాచారానికి గురయ్యింది. అనంతరం గర్భం దాల్చింది. బాధితురాలు తన ఇంటిలోనే అబార్షన్ చేసుకుంది. ఇంటిలోని కుటుంబ సభ్యులంతా ముంబై వెళ్లిన సందర్భంలో ఆమె ఇంటిలో ఒంటరిగా ఉంది. ఇదే తగిన సమయం అని భావించి, ఆమె యూట్యూబ్‌లో అబార్షన్‌కు సంబంధించిన వీడియోను చూసి దానిలో చెప్పిన పద్దతులను అనుసరిస్తూ అబార్షన్ చేసుకుంది. 

ఈ విధంగా ఆమె ఏడు నెలల గర్భాన్ని బలవంతంగా తొలగించుకుని ఒక మృతశిశువుకు జన్మనిచ్చింది. అబార్షన్ చేసుకునేందుకు తన ఇంటిలో అందుబాటులో ఉన్న పరికరాలను వినియోగించింది. ఫలితంగా ఆమె శరీరానికి ఇన్షెక్షన్ సోకింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెపై అత్యాచారం జరిపిన వ్యక్తే అమెను అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. అతనికి అప్పటికే వివాహం కావడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 2016 నుంచి తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అప్పటినుంచి పలుమార్లు తనను శారీకరంగా కలిశాడని పేర్కొంది. ఈ నేపధ్యంలోనే గర్భవతిని అయ్యానని, అయితే తనను అబార్షన్ చేయించుకోవాలని అతను ఒత్తిడి చేశాడని, పెళ్లి చేసుకునేందుకు కూడా నిరాకరించాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడు సోహెల్ వాహబ్ ఖాన్ ను అత్యాచార ఆరోపణలపై అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...