Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళకు చేదు అనుభవం.. గృహప్రవేశం చేసి గంటలు గడవకముందే ఇంట్లో..

వాషింగ్టన్: అమెరికాలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఇష్టపడి కొనుగోలు చేసిన ఇంట్లో.. గంటల వ్యవధిలోనే మంటలు చెలరేగడంతో షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన మహిళ తాజాగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కొనుగోలు చేశారు. కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసి.. రెస్టారెంట్‌లో భోజనం చేసేందుకు సరదాగా బయటకు వెళ్లారు. ఈ క్రమంలో గృహప్రవేశం సందర్భంగా ఇంట్లో ఏర్పాటు చేసిన ‘లెస్ట్ స్టే హోమ్’ అనే వెల్‌కమ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రాజుకుంది. దీంతో ఇంట్లో మంటలు చెలరేగాయి. రెస్టారెంట్ నుంచి తిరిగొచ్చిన మహిళ.. ఇంట్లో పరిస్థితిని చూసి షాక్‌కు గురయ్యారు. అనంతరం తనకు కలిగిన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇంట్లోకి ప్రవేశించి 24 గంటలు గడవకముందే.. మంటలు చెలరేగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని ఆమె వివరించారు. కాగా.. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement