మహిళలూ.. స్వావలంబన సాధించండి

ABN , First Publish Date - 2022-01-25T05:22:27+05:30 IST

స్వయంశక్తి సంఘాల మహిళలు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడి స్వావలంబన సా ధించాలని డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ సూచించారు. పొగిరి, రాజ య్యపేట గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీలు నిర్వహిస్తున్న జీవనోపాధి యూ నిట్లను సోమవారం పరిశీలించారు.

మహిళలూ.. స్వావలంబన సాధించండి
కజ్జిపుండల తయారీని పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ పీడీ


 డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ 

రాజాం, జనవరి 24: స్వయంశక్తి సంఘాల మహిళలు స్వయం ఉపాధితో తమ కాళ్లపై తాము నిలబడి స్వావలంబన సాధించాలని డీఆర్‌డీఏ పీడీ బి.శాంతిశ్రీ సూచించారు. పొగిరి, రాజయ్యపేట గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీలు నిర్వహిస్తున్న జీవనోపాధి యూనిట్లను సోమవారం పరిశీలించారు. పొగిరిలో కజ్జిపుండల తయారీ, రాజయ్యపేటలో పేపర్‌ ప్లేట్ల తయారీ యూనిట్లను ఆమె పరిశీలించారు. జీవనోపాధి యూనిట్లు నిర్వహణ, స్వయం ఉపాధిపై ఆరా తీశారు. డ్వాక్రారుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. అనంతరం స్థానిక వెలుగు కార్యాలయంలో ఏసీ శ్రీరాములు, సిబ్బందితో సమీక్షించారు.  పోషక విలువ గల ఆహారాన్ని మహిళలు తీసుకొనేలా వెలుగు సిబ్బంది చైతన్యపరచాలన్నారు. న్యూట్రీ గార్డెన్‌ లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  కార్యక్రమంలో ఏపీఎంలు బాబూరావు, అప్పలనాయుడు,  ధనలక్ష్మి, స్ర్తీనిధి రాజాం క్లస్టర్‌మేనేజర్‌ యు.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-25T05:22:27+05:30 IST