Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళల్లో క్రీడాస్ఫూర్తి, శక్తి ఎక్కువే


- అంతర్‌ కళాశాలల మహిళా క్రీడాపోటీలు ప్రారంభం

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 7: మహిళల్లో క్రీడాస్ఫూర్తి, శక్తి అధికంగా ఉంటుందని ఎస్‌కే యూనివర్శిటీ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి జెస్సీ పేర్కొన్నారు.  ఎస్కేయూ అంతర్‌ కళాశాలల మహిళా క్రీడాపోటీ లను మంగళవారం స్థానిక ఎస్‌ఎస్‌బీఎన కళాశాలలో ప్రారంభిం చారు.  క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, స్నేహపూర్వక వాతావరణంలో ఆటలు ఉండాలన్నారు. కరస్పాండెంట్‌ పీఎల్‌ఎన రెడ్డి, కార్యదర్శి నిర్మలమ్మ, ఉపాధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ క్రీడలతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. కబడ్డీ, వాలీబాల్‌, బా స్కెట్‌బాల్‌, బాల్‌ బ్యాడ్మింటన, షటిల్‌ బ్యాడ్మింటన, చెస్‌, ఖో-ఖో, టేబుల్‌టెన్నీస్‌, క్రికెట్‌, లానటెన్నీస్‌ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ మురళీమోహన, కార్యవ ర్గసభ్యులు విఠల్‌, పీడీలు చంద్రమోహన, ప్రసాద్‌, రసూల్‌, వెంకటేష్‌ నాయక్‌ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement