మహిళా కానిస్టేబుల్‌పై సీఐ లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-05-01T14:59:46+05:30 IST

మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న

మహిళా కానిస్టేబుల్‌పై సీఐ లైంగిక వేధింపులు

  • లాలాగూడ సీఐ సస్పెన్షన్‌


హైదరాబాద్/అడ్డగుట్ట : మహిళా కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ సీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. లాలాగూడ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ను సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌లో వేధించడమే కాకుండా చాటింగ్‌లు, వీడియా కాల్‌లో లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. మనస్తాపం చెందిన ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. బాధితురాలి బంధువు రమాగౌడ్‌ సీపీకి సాక్ష్యాలు చూపించాడు. స్పందించిన సీపీ లాలాగూడ సీఐ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2021-05-01T14:59:46+05:30 IST