Abn logo
Sep 25 2021 @ 00:48AM

మహిళా సాధికారితే ప్రభుత్వ లక్ష్యం

మాట్లాడుతున్న మహిళా కమిషన చైర్‌పర్సన వాసిరెడ్డి పద్మ

దిశాచట్టాన్ని మరింత బలోపేతం చేస్తాం

మహిళా కమిషన చైర్‌పర్సన వాసిరెడ్డి పద్మ

కడప(కలెక్టరేట్‌), సెప్టెంబరు 24 : దిశా చట్టాన్ని మరింత బలోపేతం చేసి, మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర మహిళా కమిషన చైర్‌పర్సన వాసిరెడి ్డ పద్మ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహళా సాధికారిత వైపు అడుగులు వేస్తుందన్నారు. మహిళలకు ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని నియామకాలలో 50 శాతం కేటాయించడం జరిగిందన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహిళల పట్ల చిన్నచూపు చూసే విధానంలో మార్పు రావాలన్నారు. మగవాళ్లకు సమానంగా మహిళలు అబివృద్ధి చెందాలన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగితే వారంలోగా విచారణ చేపట్టి 21 రోజుల్లో శిక్ష పడేలా దిశ చట్టం తేవడం జరిగిందన్నారు. ప్రతిపక్ష పార్టీలు దిశా చట్టా న్ని హేళన చేయడం తగదన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన సభ్యురాలు జి.వెంకటలక్ష్మి, మహిళా కమిషన డైరెక్టర్‌ కె.సూయాజ్‌, డిప్యూటీ మేయర్‌ ముంతాజ్‌బేగం, ఏపీ అర్బన ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్‌ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


మహిళల అభివృద్ధికి అభ్యున్నతికి పెద్దపీట

రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందని మహిళా కమిషన చైర్‌పర్సన వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో మహిళా కమిషన, కలెక్టర్‌ విజయరామరాజు ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈసందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మహిళలు గౌరవింపబడే సమాజంలో అన్ని రంగా ల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ దిశాయాప్‌ను డౌనలోడు చేసుకోవాలన్నారు. కలెక్టర్‌ వి.విజయరామరాజు మాట్లాడుతూ జిల్లాలో కొవిడ్‌తో మరణించిన కుటుంబాలలో మహిళలకు మరింత చేయూతనిస్తూ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన డైరెక్టర్‌, మెంబర్లు, జిల్లా స్ర్తీ, శిశు సంక్షేమం అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌, సిబ్బంది పాల్గొన్నారు.