విద్యతోనే మహిళా సాధికారత

ABN , First Publish Date - 2022-08-12T05:12:11+05:30 IST

విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవు తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

విద్యతోనే మహిళా సాధికారత
జూమ్‌ మీటింగ్‌లోఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మహిళలు

- రాఖీ సందర్భంగా మహిళలతో కేటీఆర్‌ జూమ్‌ మీటింగ్‌

- పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, లబ్ధిదారులు

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 11 : విద్యతోనే మహిళా సాధికారత సాధ్యమవు తుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. అందుకే ముఖ్య మంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల ద్వారా ఐదు లక్షల మంది విద్యార్థినులకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నా రని అన్నారు. రాఖీపండగను పురస్కరించుకుని గురువారం ఆయన హైదరాబా ద్‌ నుంచి ప్రభుత్వ పథకాలు పొందిన మహిళా లబ్ధిదారులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. పట్టణంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో జరిగిన జూమ్‌ మీటింగ్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి లక్ష్మారెడ్డి, మహిళలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌కు చెందిన పద్మ అనే మహిళ జూమ్‌ మీటింగ్‌లో మాట్లాడింది. తాము ఆరుగురం అక్కాచెల్లెళ్ళమని, తమ వివాహాలకు కల్యాణలక్ష్మి ఇచ్చి ముఖ్యమంత్రి ఆదుకు న్నారని, ఆయనకు మహిళల ఆశీస్సులుంటాయని అన్నారు. దీనిపై మంత్రి కేటీ ఆర్‌ స్పందిస్తూ సీఎంకు కూడా తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లని, వారి పెళ్లికి ఎంతో యాతన పడ్డారని, అందుకే ఆడ పిల్ల పెళ్ళి భారం కాకూడదనే మేనమా మ వలె కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ అందజేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీపౌర్ణమి సందర్భంగా మహిళలు రాఖీలు కట్టి ఆశీర్వదించా లని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కు మహిళలంతా అండగా ఉండాలని, కేసీఆర్‌ చిత్రపటానికి రాఖీలు కట్టి ఆశీర్వదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, జడ్చర్ల మునిసిపల్‌ చైర్మన్‌ దోరేపల్లి లక్ష్మి, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:12:11+05:30 IST