మహిళను విచారణకు తీసుకెళ్లిన పోలీసులు

ABN , First Publish Date - 2021-05-17T04:47:04+05:30 IST

పట్టణంలోని అళహరివారి వీధికి చెందిన వినూత్న అనే మహిళ తమ ఆస్తులను వైసీపీ నాయకులు కాజేస్తున్నారని వారి నుంచి కాపాడాలని సోషల్‌

మహిళను విచారణకు తీసుకెళ్లిన పోలీసులు
మహిళ ఇంటి దగ్గర విచారిస్తున్న డీఎస్పీ, సీఐ, వైసీపీ నాయకులు

 వైసీపీ నాయకులపై సోషల్‌ మీడియాలో పోస్టే కారణం

  మతిస్థిమితం లేదన్న కుటుంబసభ్యులు

కావలి, మే 16: పట్టణంలోని అళహరివారి వీధికి చెందిన వినూత్న అనే మహిళ తమ ఆస్తులను వైసీపీ నాయకులు కాజేస్తున్నారని వారి నుంచి కాపాడాలని సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. దీంతో వైసీపీ నేతలు కావలి ఏఎంసీ చైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి ఆదివారం డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి డీఎస్పీ ప్రసాద్‌రావు, ఒకటో పట్టణ సీఐ శ్రీనివాసరావులను వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె చేసిన ఆరోపణలపై కుటుంబసభ్యులను అడిగారు. అయితే ఆమె మానసిక స్థితి బాగాలేదని, ఐదేళ్లుగా భర్తకు దూరంగా ఉంటుందని చెప్పారు. దీంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. పోస్ట్‌లో పెట్టిన మాటలనే మరలా చెప్పింది. తమ కుటుంబసభ్యులు డ్రగ్స్‌ ఇచ్చి ఇబ్బందులు పెడుతు న్నారని, నా కన్న తల్లితండ్రులు కాదని తెలిపింది. అయితే ఆమె తల్లి తన కూతురు మానసిక స్థితి దృష్ట్యా ఏదైనా ఆసుపత్రికి పంపమని పోలీసు లకు లిఖిత పూర్వకంగా తెలిపింది. దీంతో ఆమె భర్తకు ఫోన్‌ చేసి ఆయన వచ్చిన విచారించి కౌన్సెలింగ్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - 2021-05-17T04:47:04+05:30 IST