4.7 కోట్ల మహిళలు పేదరికంలోకి...

ABN , First Publish Date - 2020-09-13T05:30:00+05:30 IST

కరోనా మహమ్మారి ఎంతోమంది ఆశలు, జీవితాలను తలకిందులు చేసింది. లక్షలాది మందిని పేదరికంలోకి నెట్టింది.

4.7 కోట్ల మహిళలు పేదరికంలోకి...

కరోనా మహమ్మారి ఎంతోమంది ఆశలు, జీవితాలను తలకిందులు చేసింది. లక్షలాది మందిని పేదరికంలోకి నెట్టింది. కరోనా దెబ్బతో 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు నాలుగున్నర కోట్లకు పైగా మహిళలు, అమ్మాయిలు కడు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక చెబుతోంది. దీంతో వీరిని దారిద్యరేఖకు ఎగువన తీసుకొచ్చేందుకు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషి నిష్ఫలం కానుంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) అంచనా ప్రకారం కరోనా సంక్షోభం మహిళల్ని మరింత పేదరికంలోకి నెడుతుంది. పేదరికంలో మగ్గుతున్న మగవాళ్లు, ఆడవాళ్ల మధ్య అంతరం మరింత పెరగనుంది. 


పదేళ్ల పురోగతి ఒక్కసారిగా డీలా

2019 నుంచి 2011 నాటికి మహిళల్లో బీదరికం 2.7శాతం తగ్గుతుందని అంచనా వేశారు. కానీ కరోనా మూలంగా మహిళల్లో పేదరికం 9.1శాతం పెరగనుంది. ‘‘కొవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా సుమారు 9.6 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టివేయనుంది. వీరిలో 4.7కోట్ల మంది మహిళలు, అమ్మాయిలు ఉండనున్నారు. దీంతో కడు పేదరికంలో ఉన్న మహిళలు, అమ్మాయిల సంఖ్య 43 కోట్లకు చేరనుంది. ఈ సంఖ్య 2030 వరకూ ఇలానే ఉండనుంది’’ అని యూఎన్‌డీపీ చెబుతోంది. కరోనా దెబ్బతో అన్ని దేశాల్లో పేదరికం పెరగనుంది. అయితే మహిళలపై మీద ముఖ్యంగా ప్రత్యుత్పత్తి దశలో ఉన్న వారి మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది. దాంతో స్త్రీ, పురుష నిష్పత్తిలో ఎక్కువ అంతరాలు వస్తాయి. 2021 నాటికి పేదరికంలో మగ్గుతున్న 25 నుంచి 34 ఏళ్ల వయసున్న 100 మంది పురుషులకు 118 మహిళలు ఉంటారు. 2030 వచ్చే నాటికి ఈ అంతరం పెరిగి 100మంది పురుషులకు 121 మంది మహిళలు ఉంటారు.

Updated Date - 2020-09-13T05:30:00+05:30 IST