మహిళా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

ABN , First Publish Date - 2021-10-23T04:32:16+05:30 IST

మహిళా రైతులు సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతారని మండల పరిషత్‌ అధ్యక్షురాలు బోకం సూర్యకుమారి అన్నారు.

మహిళా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
మాట్లాడుతున్న ఎంపీపీ బోకం సూర్యకుమారి

సబ్బవరం, అక్టోబరు 22 : మహిళా రైతులు సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడే మంచి ఫలితాలు సాధించగలుగుతారని మండల పరిషత్‌ అధ్యక్షురాలు బోకం సూర్యకుమారి అన్నారు. స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఏవో పోతల సత్యనారాయణ అధ్యక్షతన డివిజన్‌ స్థాయి మహిళా రైతు దినోత్సవం(మహిళా కిసాన్‌ దివాస్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రంగాల్లో 70 శాతం మహిళలే ఉన్నారన్నారు. దేశాభ్యున్నతిలో మహిళలే కీలకమని, మరింతగా రాణించేందుకు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యక్షురాలు డీవీఎస్‌ జాన్సీ లక్ష్మీరాణి మాట్లాడుతూ వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు మహిళా రైతులకు అన్ని విధాల తోడ్పాటును అందించి వ్యవసాయ రంగంలో కూడా మహిళలు కీలకపాత్ర పోషించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ ఉపాధ్యక్షుడు బీఎం నాయుడు, శరగడం రాము, ఏడీఏ ఎన్‌.కోటేశ్వరరావు, ఎంపీడీవో రమేశ్‌నాయుడు, ఏఈవో బాలరాజు, వివిధ బ్యాంకుల సమన్వయకర్తలు, వీఏఏలు, పలువురు మహిళా రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-23T04:32:16+05:30 IST