మహిళల్లో గుండె సమస్యలు!

ABN , First Publish Date - 2020-02-18T10:16:19+05:30 IST

పురుషులతో పోలిస్తే మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ అనేది అపోహ. మహిళల్లో కనిపించే గుండె సమస్యల తాలూకూ లక్షణాల్లో కూడా అపోహలు

మహిళల్లో గుండె సమస్యలు!

పురుషులతో పోలిస్తే మహిళలకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ అనేది అపోహ. మహిళల్లో కనిపించే గుండె సమస్యల తాలూకూ లక్షణాల్లో కూడా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటికి విశ్లేషణాత్మకమైన వివరణ ఇస్తూ, ఆ అపోహలను పటాపంచలు చేస్తున్నారు వైద్య పరిశోధకులు. అవేమిటంటే....

  • అపోహ: గుండె జబ్బులు పురుషులకే పరిమితం!
  • నిజం: మహిళల్లో, పురుషుల్లో గుండె జబ్బులు సమాన స్థాయిలో ఉంటాయి. హార్ట్‌ ఫెయిల్యూర్‌, గుండెపోటు, హైపర్‌టెన్షన్‌ లాంటి గుండె సమస్యలు ఇరువురికీ తలెత్తే అవకాశాలు సమానంగా ఉంటాయి.
  • అపోహ: గుండె సమస్య స్త్రీపురుషుల్లో ఒకే రకంగా ఉంటుంది.
  • నిజం: మహిళల్లో గుండె జబ్బు పురుషులకు భిన్నంగా ఉంటుంది. గుండె రక్తనాళాల్లో పేరుకునే కొవ్వు ఇరువురిలో భిన్నంగా కనిపిస్తుంది. అలాగే ఆ కొవ్వు ప్రభావం కూడా స్త్రీపురుషుల్లో వేర్వేరుగా ఉంటుంది. మహిళల్లో గుండె పోటును సులువైన రక్త పరీక్షతో  కనిపెట్టే వీలుంది. పరిమాణంలో వీరి గుండె చిన్నదిగా ఉండడం మూలంగా, గుండె పోటుతో గుండె డ్యామేజి అయినప్పుడు శరీరం ‘ట్రొపోనిన్‌’ అనే ప్రొటీన్‌ను తక్కువ పరిమాణంలో రిలీజ్‌ చేయడమే ఇందుకు కారణం. ఈ ప్రొటీన్‌ను రక్త పరీక్షతో కనిపెట్టి, గుండెకు జరిగిన నష్టాన్ని తేలికగా అంచనా వేసే వీలుంది. అయితే  గుండె పోటు వచ్చిన మహిళలకు, పురుషులకు చేసే పరీక్షలను చేయడంతో, వారి గుండె జబ్బులను కనిపెట్టడంలో, చికిత్స అందించడంలో ఆలస్యం జరుగుతోంది. 
  • అపోహ: మహిళల్లో దవడ నొప్పి, పొట్టలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి లక్షణాలు తప్ప, ఛాతి పట్టేయడం, ఛాతిలో నొప్పి లాంటి సర్వసాధారణ లక్షణాలు 
  • కనిపించవు.
  • నిజం: నిజానికి మహిళల్లో గుండె సమస్య లక్షణాలు చాలా స్పష్టంగా, పురుషులతో పోలిస్తే ఒకింత ఎక్కువగా కనిపిస్తాయి. పురుషుల్లో కనిపించే లక్షణాలకు అదనంగా రెండు లేదా మూడు లక్షణాలు చూడొచ్చు. అయితే వాటిని ఒత్తిడి, ఆందోళనల ఫలితంగా భావించే మహిళలే ఎక్కువ. అలాగే పురుషులు గ్రహించినంత తేలికగా మహిళలు తమ లక్షణాలు గుండె సమస్యకు సూచనలుగా గ్రహించలేరు.

Updated Date - 2020-02-18T10:16:19+05:30 IST