Advertisement
Advertisement
Abn logo
Advertisement

21 నుంచి మహిళా ధ్యాన మహాచక్రం

ఆమనగల్లు: కడ్తాల మండలం అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలోని కైలాస పురి మహేశ్వర మహాపిరమిడ్‌లో ఈనెల 21 నుంచి 31 వరకు మహిళా ధ్యాన మహాచక్రం-3 నిర్వహిస్తున్నట్లు ధ్యాన మహాచక్రం చైర్మన్‌, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. మహేశ్వర మహాపిరమిడ్‌ను ఆదివారం ఫిరమిడ్‌ ట్రస్టీ సభ్యులు విజయభాస్కర్‌రెడ్డి, సాంబశివరావు, మాధవి, జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డిలతో కలిసి  సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పిరమిడ్‌ స్పిర్చ్యువల్‌ సొసైటీస్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు, ప్రపంచ ధ్యాన గురువు సుభాష్‌ ప్రతిజీ ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ధ్యాన మహాసభలు జరుగుతాయని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ధ్యాన మహాసభలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ధ్యానులు, సందర్శకులు ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ట్రస్టీ సభ్యులు, నిర్వాహకులకు సూచించారు. ధ్యానులు, సందర్శకులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఆయన వెంట పిరమిడ్‌ ట్రస్టీ సభ్యులు రాంబాబు, లక్ష్మి, బాలకృష్ణ, శ్రీరామ్‌గోపాల్‌, మారం శివప్రసాద్‌, కృష్ణంరాజు, జయశ్రీ, రాజేశ్‌, చంద్రశేఖర్‌, సర్పంచులు శంకర్‌, హరిచంద్‌ నాయక్‌, కృష్ణయ్య, నాయకులు అంజి, శ్రీను, ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement