హైదరాబాద్/ఆనంద్‌బాగ్ : భర్త గొడవ పడటంతో మనస్థాపం చెందిన వివాహిత కనిపించకుండా వెళ్లింది. మల్కాజిగిరి గౌతంనగర్‌కు చెందిన నీలం సునీత(35) భర్త తరచూ మద్యం తాగి, గొడవ పడుతుండేవాడు. దీంతో ఆమె ఏప్రిల్ 3న ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఆమె సోదరి భర్త తుమ్మల క్రాంతి మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.